Headlines

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APCOBలో 338 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు!

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  APCOBలో 338 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు!


APCOB Recruitment 2026 Telugu: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) నుంచి నిరుద్యోగులకు ఒక చక్కటి శుభవార్త వెలువడింది. బ్యాంకులో వివిధ విభాగాల్లో 338 స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24/07/2026
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07/08/2026

పోస్టుల వివరాలు, ఖాళీలు

  • సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB)
  • పోస్టుల పేరు: స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్
  • మొత్తం పోస్టుల సంఖ్య: 338
  • ఉద్యోగ విధానం: పర్మనెంట్ జాబ్స్

విద్యా అర్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు ఆంగ్ల పరిజ్ఞానంతో పాటు స్థానిక భాష (తెలుగు) మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం (Computer Knowledge) తప్పనిసరిగా ఉండాలి.

  • వయోపరిమితి: కనీస వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు, వయస్సును 01.06.2026 నాటికి ప్రాతిపదికగా లెక్కించడం జరుగుతుంది. (నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది).
  • నెలసరి జీతం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం సుమారు రూ. 47,000/- వరకు ఉంటుంది.

దరఖాస్తు రుసుము (Application Fee):

  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు (PWD) / ఎక్స్-సర్వీస్‌మెన్ (EXS): రూ. 590/-
  • OC / BC / EWS, ఇతర అభ్యర్థులు: రూ. 826/-
  • ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం (Selection Process)

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

  • రాత పరీక్ష (Written Examination)
  • టైపింగ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు చేసుకునే విధానం ఎలా?

  • అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ https://apcob.bank.in/careers/ లేదా https://vizianagaramdccb.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే “APPLY ONLINE” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *