Headlines

Psychology: అవసరం లేకపోయినా పదే పదే అబద్దాలు చెబుతున్నారా? మీరు ఒంటరితనంతో బాధపడుతున్నట్లే

Psychology: అవసరం లేకపోయినా పదే పదే అబద్దాలు చెబుతున్నారా? మీరు ఒంటరితనంతో బాధపడుతున్నట్లే


చాలా మంది సమయం దొరికినప్పుడల్లా నిద్రపోవడానికి ఇష్టపడతారు. పైకి చూస్తే ఇది సోమరితనం, సంతోషకరమైన జీవితంలా అనిపించినప్పటికీ మనస్తత్వశాస్త్రం మాత్రం అందుకు భిన్నంగా చెబుతుంది. ఇలాంటి వారు ప్రాథమికంగా మనసులోని ఏదో ఒక తీవ్రమైన విచారాన్ని లేదా ఒంటరితనాన్ని దాచుకోవడానికి ఎక్కువగా నిద్రను ఆశ్రయిస్తారు. ప్రతి మాటకు పగలబడి నవ్వేవాళ్ళు లేదా ఎప్పుడూ జోకులు వేసేవాళ్ళు నిజానికి అత్యంత ఒంటరివాళ్ళు. వారు అందరి ముందు నవ్వు అనే ప్రకాశవంతమైన ముసుగు ధరించి, తమ మనసులో లోతుగా నిక్షిప్తమై ఉన్న చెప్పలేని మాటలను అణచివేసుకుంటారని సైకాలజీ చెబుతుంది. ఎవరూ అడగకుండానే సహాయం చేసేవారు నిజానికి లోపల చాలా ఒంటరిగా ఉంటారు. ఇతరుల అవసరాల కోసం తమను తాము త్యాగం చేసుకుంటారు. నిజానికి ఇలాంటి వారు తమ కోసం ఒక నమ్మకమైన తోడును వెతుక్కుంటున్నారని అర్ధం.

అవసరం లేకపోయినా పదేపదే అబద్ధాలు చెప్పే వ్యక్తులు కూడా మన చుట్టూ ఉంటారు. వాస్తవానికి వీరు తీవ్రమైన అభద్రతా భావంతో బాధపడుతుంటారు. వారు తమ పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి, తమ ప్రియమైన వారిని, సన్నిహితులను కోల్పోతామనే భయంతో అబద్ధాలు చెబుతుంటారు. చిన్న స్పర్శకే కళ్ళు చెమ్మగిల్లే వ్యక్తులు నిజానికి చాలా సున్నిత మనస్కులు. వారి మనసులో ఎలాంటి సంక్లిష్టతలు ఉండవు. కానీ ఒక చిన్న భావోద్వేగపు దెబ్బ కూడా వారిని చాలా సులభంగా కుంగదీస్తుంది. కొంత మంది చాలా మొండిగా లేదా కఠినంగా ఉంటారు. ఎవరితోనైనా కఠినంగా మాట్లాడటానికి వెనుకాడరు. నిజానికి వారి హృదయాలు లోపల గాయపడి ఉంటాయి.

తమ అంతర్గత బాధను, బలహీనతను బయటి ప్రపంచం నుంచి దాచడానికి వారు ఈ కఠినత్వమనే కవచాన్ని ధరిస్తారు. అయితే ఎప్పుడూ మౌనంగా ఉండటానికి ఇష్టపడేవారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి తెలుసు. బయటి గందరగోళంతో మాట్లాడటం కంటే తమ అంతరాత్మతో మాట్లాడటానికే వారు ఎక్కువ సౌకర్యంగా భావిస్తారు. ఇలాంటి వారి చిన్న చిన్న ఇష్టాలు, అలవాట్లను నిశితంగా గమనిస్తే నిస్సందేహంగా మామూలు కన్నా కొంచెం ఎక్కువగానే వీరు మిమ్మల్ని ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిష్కారాలు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. మేము వాటిని ఆమోదించడం లేదు. దయచేసి వాటిని అనుసరించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *