పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో బెంగాల్లో రాజకీయ హీటెక్కింది. ఎన్నికల ప్రచారంలో TMC, BJP దూకుడు పెంచాయి. డూ ఆర్ డై అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం బెంగాల్‌ను చుట్టుముట్టింది. బీజేపీ అగ్రనాయకత్వమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన సీఎంలు బెంగాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మమతా బెనర్జీ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. బెంగాల్ మహిళలను TMC మళ్లీ మోసం చేసిందని బంకురాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఫైర్ అయ్యారు. 33 శాతం రిజర్వేషన్ కావాలని బెంగాల్ మహిళలు కోరుకున్నారనీ, అది కూడా 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే అమల్లోకి రావాలని ఆశించారన్నారు. మహిళా రిజర్వేషన్‌ను కాంగ్రెస్‌తో కలిసి TMC కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కానీ బెంగాల్ బిడ్డలు ఎక్కువ సంఖ్యలో MLA, MPలు కావడం TMCకి ఇష్టం లేదన్నారు మోదీ. అలాంటి TMCకి ఓటు అనే ఆయుధంతో పెద్ద శిక్ష వేయాల్సిన సమయం వచ్చిందని మోదీ పిలుపునిచ్చారు.
ఝల్మురి తింటూ..
అయితే.. ఆదివారం నాడు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా నాలుగు ర్యాలీలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.. అయితే.. మధ్యలో ఝార్గ్రామ్లో రుచికరమైన ముర్మురాలు (ఝల్మురి)ని తింటూ ప్రధాని మోదీ ఆస్వాదించారు. ఝల్మురి (Jhal Muri) అనేది బెంగాల్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన స్పైసీ స్నాక్. ముర్మురాలు (పఫ్డ్ రైస్).. మసాలా.. ఉప్పు కారం.. తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి తయారు చేస్తారు.. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.. నాలుగు ర్యాలీల మధ్యలో ఝార్గ్రామ్లో రుచికరమైన ముర్మురాలు (ఝల్మురి)ని తిన్నానంటూ దానిలో పేర్కొన్నారు.
In between four rallies across West Bengal on a packed Sunday, had some delicious Jhalmuri in Jhargram. pic.twitter.com/NEKLm5R0mE
— Narendra Modi (@narendramodi) April 19, 2026