Headlines

Balakrishna : బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు.. తర్వాత హీరోయిన్‏గా నటించిన ముద్దుగుమ్మ.. ఇప్పటికీ ఫుల్ క్రేజ్..


తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కథానాయిక మీనా. చైల్డ్ ఆర్టి్స్టు నుంచి కథానాయికగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. తన సినీ ప్రస్థానంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్, బాలనటిగా ఆమె ఎదుగుదల, దిగ్గజ నటులతో పనిచేసిన అనుభవాలు, వ్యక్తిగత జీవిత విశేషాలను ఆమె ప్రస్తావించారు. మీనా బాలనటిగా దాదాపు 50 చిత్రాలలో నటించారు. శివాజీ గణేశన్, రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి వంటి అగ్రనటులతో కలిసి బాలనటిగా తెరపై కనిపించారు. అయితే, నందమూరి బాలకృష్ణతో కూడా తాను బాలనటిగా నటించిన విషయం చాలా మందికి తెలియదని మీనా వెల్లడించారు. బాలకృష్ణ నటించిన “డిస్కో డాన్సర్” చిత్రంలో ఒక చిన్న పాప పాత్రను తాను పోషించానని, ఆ విషయం చాలా అరుదుగా ప్రస్తావించబడుతుందని ఆమె గుర్తు చేసుకున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, అదే హీరోలతో హీరోయిన్‌గా నటించే అరుదైన అవకాశం తనకు లభించిందని, శ్రీదేవి, జయలలిత వంటి కొందరు నటీమణులకు మాత్రమే ఇలాంటి అదృష్టం దక్కిందని మీనా తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

తన సినీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశాన్ని మిస్ చేసుకున్న విషయాన్ని కూడా మీనా పంచుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన “గీతాంజలి” చిత్రంలో మూడు సిస్టర్ పాత్రలలో ఒకదాని కోసం ఆమెను ఎంపిక చేసుకున్నప్పటికీ, పరీక్షల కారణంగా ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 20 రోజులు ఊటీలో షూటింగ్ ఉండటంతో, పరీక్షల సమయంలో అన్ని రోజులు కేటాయించలేకపోయానని మీనా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

మీనా చదువు విషయానికి వస్తే, తన తల్లి తాను చదువును పూర్తి చేయలేదనే విషయంలో ఎప్పుడూ బాధపడేవారని ఆమె తెలిపారు. ఆ బాధతోనే ప్రైవేటుగా ఎంఏ హిస్టరీ చదివినట్లు మీనా వెల్లడించారు. తాను ఎనిమిదో తరగతి వరకు చదివానని, ఇది అక్కినేని నాగేశ్వరరావు గారు చదివిన ఐదో తరగతి కంటే మూడు తరగతులు ఎక్కువ అని సరదాగా పోల్చుకున్నారు. అప్పట్లో తాను పాఠశాలలో సగటు విద్యార్థిని అని, 100కి 50-60 మార్కులు సాధించేదానినని పేర్కొన్నారు. 60 మార్కులు ఫస్ట్ క్లాస్ అని అప్పుడు తనకు తెలియదని నవ్వారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

మీనా..



ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *