Headlines

Pan Card: పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..

Pan Card: పాన్ కార్డు పోగొట్టుకున్నారా..? డూప్లికేట్ కార్డు పొందటం ఈజీ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..


బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వరకు.. ప్రతీ పనికి పాన్ కార్డు అవసరం. అలాగే ఒక ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా పనిచేస్తుంది. అయితే ఇలాంటి ముఖ్యమైన పత్రం పొగోట్టుకున్నా లేదా నెంబర్ మర్చిపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీ పాన్ కార్డు పోయినా, దొంగిలించబడినా లేదా పాడైపోయినా ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డు కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అసలు డూప్లికేట్ పాన్ కార్డు పొందటం ఎలా..? ఈ ప్రాసెస్ ఏంటి? అనే విషయాలు చూద్దాం.

డూప్లికేట్ పాన్ కార్డుకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి..?

పాన్ కార్డు పోయినా, దొంగిలించబడినా, పాడైపోయినా, చదవడానికి వీలులేకుండా పోయినా డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ నంబర్ మాత్రం మారదు. కొత్త ఫిజికల్ కార్డు లేదా ఈ-పాన్ మాత్రమే జారీ చేస్తారు. మీకు ఇప్పటికే పాన్ ఉన్నట్లయితే.. కొత్త పాన్ కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోకూడదు. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ పాన్‌లను కలిగి ఉండటం ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలకు విరుద్దం.

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

-అధికారిక పాన్ సేవా పోర్టల్‌ను సందర్శించాలి

-పాన్ రీప్రింట్ లేదా పాన్ సవరణ పునఃజారీ ఎంపికను ఎంచుకోండి

– మీ పాన్ నంబర్, ఆధార్ లేదా ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి

– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కు పంపిన OTPని ఎంటర్ చేయాలి

– రుసుంను చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.

– ట్రాక్ చేయడానికి మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది. దానిని సేవ్ చేసి పెట్టుకోవాలి.

ఏ పత్రాలు అవసరం?

మీ పాన్ వివరాలు ఆధార్ అనుసంధానించబడి ఉంటే మీరు కొత్త పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయాలంటే ధృవీకరణ కోసం సహాయక పత్రాలను అందించాల్సి ఉంటుంది.

డూప్లికేట్ పాన్ కోసం సమయం పడుతుంది?

దరఖాస్తు విజయవంతంగా ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఎంచుకున్నట్లయితే సాధారణంగా ఇ-పాన్ మొదట అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు పంపబడుతుంది. మీ ప్రాంతం, సర్వీస్ ప్రొవైడర్ యొక్క ప్రాసెసింగ్ సమయాన్ని బట్టి డెలివరీ సమయం మారవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *