TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. దర్శన టికెట్లు, వసతి గదుల పేరుతో సోషల్ మీడియా, గూగుల్‌లో చెలరేగిపోతున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేరళకు చెందిన సి.కె.సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయాడు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి…