ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
వారమంతా ఆఫీసు పనులు, ఒత్తిళ్లతో గడిపే మనకు ఆదివారం అనే మాట వింటేనే మనసు తేలికపడుతుంది. కానీ ఈ ఒక్క రోజు సెలవు కోసం ఒకప్పుడు భారతీయ కార్మికులు ఏడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారని మీకు తెలుసా? ఒకప్పుడు దేశంలోని మిల్లుల్లో ముఖ్యంగా ముంబై వస్త్ర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. వారంలో ఏడు రోజులు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వారు పని చేయాల్సిందే. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి లేదా కుటుంబంతో…