
Watch Video: ఒకేసారి జ్యువెలరీషాప్‌లోకి చొరబడిన 25 మంది దొంగలు.. సీన్ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి..
సాధారణంగా దొంగలు బ్యాంక్ లేదా నగల షాప్‌లో దూరి దొంగతనం చేయాలనుకుంటే ఇద్దరు లేదా ముగ్గురు వస్తారు. గన్‌లు, కత్తులతో బెదిరించి అందినకాడికి దోసుకెళ్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో మాత్రం ఒకేసారి 25 మంది దొంగలు ఒక నగల షాప్‌లోకి చొరపడ్డారు. అది చూసిన షాపు సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారి చేతుల్లో ఉన్న ఆయుధాలను చూసి వణికిపోయారు. దోపిడి చేసేందుకు వచ్చిన దొంగలు తమ దగ్గర ఉన్న సుత్తెలు, గడ్డపారలు వంటి మారణాయుధాలతో షాపును…