Tiger: పులి వారానికి ఎన్ని కేజీల మాంసం తింటుందో తెల్సా.! వామ్మో చూస్తే నోరెళ్లబెడతారు
తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్(DFO) ఆనంద్ రెడ్డి.. స్థానిక అడవుల్లో పులుల జీవనం, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కీలక అంశాలను వివరించారు. పులులు స్వతంత్ర జీవులని, తల్లితో ఉన్న పిల్లలు తప్ప మిగిలినవి ఒంటరిగా తిరుగుతాయని తెలిపారు. వాటి చారలు మనుషుల వేలిముద్రల వలె ప్రత్యేకమైనవని, టైగర్ సెన్సస్‌లో ఈ చారలను ఉపయోగించడం శాస్త్రీయమైన పద్ధతి అని పేర్కొన్నారు. ఒక పెద్ద పులి (200-250 కేజీలు) వారానికి సుమారు 40 కేజీల మాంసం…