ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు ఖాళీ బిందెలతోనో, ప్లేకార్డులతోనో నిరసన తెలపడం చూస్తుంటాం. కానీ నిడదవోలు మున్సిపాలిటీలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తమ వార్డులో పాముల భయం ఏ స్థాయిలో ఉందో వివరించడానికి ఓ కౌన్సిలర్ ఏకంగా పాముతో కౌన్సిల్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిడదవోలు 20వ వార్డు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్, శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పామును…