
Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భలే గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఇంటి నిర్మాణ ఖర్చులు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు దిగింది. ఇప్పటికే ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు, వ్యయాన్ని తగ్గించేందుకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తోంది. కూలీల కొరత, పెరిగిన ఖర్చులు, లబ్ధిదారుల ఇబ్బందులు ఉన్న క్రమంలో.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని నిర్ణయించింది….