శ్రీశైల మల్లన్నకు విరాళంగా బంగారు రుద్రాక్ష మాల, హారం
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తుల నుండి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. స్వామి అమ్మవార్ల పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ భక్తులు భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను సమర్పిస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు స్వామివారికి విశిష్టమైన స్వర్ణాభరణాలను కానుకగా అందజేశారు. బాపట్లకు చెందిన దాతలు, ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబ సభ్యులు మల్లన్న సేవలో భాగంగా రెండు ముఖ్యమైన ఆభరణాలను తయారు చేయించారు….