Tamannaah: గ్లామర్ ఉన్నప్పుడే జాగ్రత్త.. లేదంటే కష్టాలు తప్పవంటూ తమన్నా సంచలన వ్యాఖ్యలు
ఆమె వెండితెరపై కనిపిస్తే కుర్రకారుకు పూనకాలే. 21 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందరో వస్తుంటారు, పోతుంటారు.. కానీ ఆమె మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే ఈ సక్సెస్ వెనుక కేవలం తన గ్లామర్ మాత్రమే లేదని, పక్కాగా వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు ఉన్నాయని తాజాగా వెల్లడించింది. చేతి నిండా అవకాశాలు ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెబుతున్న ఆ స్టార్ మరెవరో కాదు.. తమన్నా…