Headlines

ప్రీమియం లుక్, హెల్త్‌పై ఫోకస్​ మరిన్ని ఫీచర్లతో బోట్‌ కొత్త స్మార్ట్‌వాచ్​! ధర తెలిస్తే షాక్

తక్కువ ధరలో ప్రీమియం రూపం, పెద్ద తెర, ఆరోగ్య పర్యవేక్షణ సదుపాయాలు కావాలనుకునేవారికి boAt Chrome Endeavour ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి ఉపయోగపడే AI కోచ్‌తో పాటు గుండె వేగం, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలను గమనించే సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ప్రీమియం డిజైన్​.. boAt Chrome Endeavour స్మార్ట్‌వాచ్‌కు ప్రీమియం మెటల్ బాడీని అందించారు. స్టీల్ బ్లాక్ స్ట్రాప్ కారణంగా చేతికి ఇది రిచ్, క్లాసీ లుక్‌ను…

Read Full News

Cinema : దేశాన్ని కుదిపేసిన క్రిమినల్ కేసు.. రియాల్టీ స్టోరీతో 53 ఏళ్లల్లో 3 సినిమాలు వచ్చాయి.. ప్రతీ మూవీ సెన్సేషన్..

ఇప్పటివరకు సినీ పరిశ్రమలో నిజ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఊహించని విజయాన్ని అందుకున్నాయి. భారతదేశ చరిత్రలో అలాంటి ఒక కేసు ఉంది. అది ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ హై ప్రొఫైల్ కేసు ఆధారంగా ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా ప్రజాదరణ పొందాయి. అంతేకాదు, ఈ కేసు ఆధారంగా వచ్చిన సినిమాకు బాలీవుడ్ నటుడు…

Read Full News

ఆరేళ్లు మన్నే బ్యాటరీతో మతిపోగొట్టే ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్! ధర ఎంతంటే

ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ ఎంతసేపు పనిచేస్తుంది? తెర బయట ఎండలో స్పష్టంగా కనిపిస్తుందా? రోజువారీ వాడకంలో ఎంతకాలం మన్నుతుంది? అనే అంశాలు కీలకంగా మారాయి. వీటికి ప్రాధాన్యత ఇస్తూ OPPO K14 Liteను తీసుకొస్తోంది. 7,000mAh బ్యాటరీ, 120Hz తెర, IP64 రక్షణతో వస్తున్న ఈ ఫోన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బ్యాటరీతో రోజంతా వాడుకోవచ్చు! OPPO K14 Liteను సెప్టెంబర్ 16, 2026న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. రోజువారీ అవసరాలతో…

Read Full News

స్కూటరా? త్రీ వీలరా? ఒక్కసారి చూస్తే కన్ఫ్యూజ్‌ అవుతారు! 100km రేంజ్‌తో BeiGo X4

సాధారణ స్కూటర్ కంటే స్టెబిలిటీ కావాలి.. త్రీ-వీలర్ కంటే బైక్‌లాంటి రైడింగ్ అనుభూతి కావాలనుకునేవారికి BeiGo X4 ఆసక్తికరంగా కనిపిస్తోంది. 100 కిలోమీటర్ల రేంజ్, Anti-Topple Tilting Technology, Triple-Disc Braking వంటి ప్రత్యేకతలతో వచ్చిన ఈ EV ప్రస్తుతం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ ధర కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు చక్రాలు.. iGowise Mobility విడుదల చేసిన BeiGo X4 ధర మొదటి 300 మంది కస్టమర్లకు రూ.1.25 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది….

Read Full News

IND vsAFG: టీమిండియాకు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్..?

India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) దురదృష్టవశాత్తూ మరోసారి గాయపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తో ఢిల్లీ వేదికగా ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఈ 35 ఏళ్ల స్పిన్నర్.. కేవలం ఒకే మ్యాచ్ ఆడి గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో తగిలిన గాయం కారణంగా జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు సైతం దూరమైన వరుణ్, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, ఒక్కరోజులో దంచికొట్టిన వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గణేశుడు వర్షాలను కూడా వెంటబెట్టుకొచ్చాడన్నట్లుగా ఆకాశానికి చిల్లుపడినట్లు వానలు దంచి కొడుతున్నాయి. ఈ అకాల వర్షాలు కొన్ని చోట్ల ఎండిపోతున్న పత్తి, వరి పంటలకు ఊరటనిచ్చాయి. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో నగరాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా, వినాయక చవితి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలోని మహబూబాబాద్‌లో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది….

Read Full News

ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు! తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది?

తెలంగాణను కోతుల బెడద తీవ్రంగా వేధిస్తోంది. అటవీ శాఖ నివేదికల ప్రకారం రాష్ట్రంలో కోతుల సంఖ్య ఏకంగా 50 లక్షలు దాటింది, ఇందులో 10 లక్షల వరకు పిల్ల కోతులే ఉన్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలను నిద్రపట్టనీయకుండా చేస్తున్న ఈ సమస్య వ్యవసాయ రంగాన్ని, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట వంటి జిల్లాల్లో రైతులు పంట నష్టంతో అల్లాడుతుండగా, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లపై దాడులు, పిల్లలపై భయంతో ప్రజలు ఇబ్బంది…

Read Full News

వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాల్లో చేపల వేట జోరందుకుంటుంది. ముఖ్యంగా గోదావరి నదిలో చిక్కే అరుదైన చేపలు మత్స్యకారులకు ఒక్కసారిగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. తాజాగా యానాంలో కూడా మత్స్యకారులకు అలాంటి అదృష్టమే కలిసొచ్చింది. వేటకు వెళ్లిన ఓ జాలరి వలకు ఏకంగా 23 కిలోల బరువున్న భారీ పండుగప్ప చిక్కింది. ఇంత భారీ చేపను చూసి మత్స్యకారులే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ చేపను యానాం రేవుకు తీసుకొచ్చి వేలం వేయగా.. ఏకంగా రూ.16 వేల…

Read Full News

వైభవ్‌ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా? పాకిస్థాన్‌కు వసీం అక్రమ్‌ చురకలు

పాకిస్థాన్ క్రికెట్‌లో బ్యాటింగ్ టాలెంట్ ఎందుకు రావడం లేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ దేశ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ స్వయంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ సూపర్ లీగ్.. అంటే PSL ప్రారంభమై దాదాపు పదేళ్లు అవుతున్నా.. ఒక్క మంచి బ్యాటర్‌ను కూడా ఎందుకు తయారు చేయలేకపోయిందని వసీం అక్రమ్ ప్రశ్నించారు. బౌలర్లను మాత్రం కొంతమందిని తయారు చేశామని.. కానీ గుర్తుండిపోయే…

Read Full News

Smartphone: మీ ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తే మీ మొబైల్ పాడవబోతోందని అర్థం!

Smartphone: స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. మనం ఉదయం, సాయంత్రం వాటితోనే సమయం గడుపుతాము. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫోన్ అకస్మాత్తుగా పాడైపోతే పెద్ద సమస్య తలెత్తుతుంది. అప్పుడు వెంటనే కొత్త ఫోన్ కొనడం కష్టమవుతుంది. కానీ ఫోన్ పాడవక ముందే దాని గురించి మీకు తెలిస్తే, దాన్ని రిపేర్ చేయించి, పాడైపోకుండా కాపాడుకోవచ్చు. ఫోన్ పాడయ్యే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని మీరు పరిగణనలోకి తీసుకుంటే, మీ ఫోన్ పాడవక…

Read Full News