Headlines

IND vsAFG: టీమిండియాకు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్..?


India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy) దురదృష్టవశాత్తూ మరోసారి గాయపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తో ఢిల్లీ వేదికగా ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఈ 35 ఏళ్ల స్పిన్నర్.. కేవలం ఒకే మ్యాచ్ ఆడి గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గతంలో తగిలిన గాయం కారణంగా జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు సైతం దూరమైన వరుణ్, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence – CoE) లో దాదాపు 2 నెలల పాటు పునరావాసం పొందాడు. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. తొలి పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, మ్యాచ్ ముగిశాక గాయం తిరగబెట్టడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.

తొలి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి తన పూర్తి కోటా 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి దర్విష్ రసూలీ వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ (Axar Patel) తో కలిసి పటిష్టమైన బౌలింగ్ వేసి ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ ఆ పోరును 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుచుకుంది.

తిరిగి వచ్చిన వెంటనే అతడు మళ్లీ గాయపడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించకుండానే అతడిని తొందరపడి మైదానంలోకి దించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి పలువురు కీలక ఆటగాళ్లు గాయాల పునరావాసం కోసం ఇక్కడే సమయం గడిపారు.

ప్రస్తుత భారత జట్టులో రవి బిష్ణోయ్ (Ravi Bishnoi), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఉన్నప్పటికీ.. వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) లేదా కృనాల్ పాండ్యా (Krunal Pandya) లను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *