ఈ వారం ఓటీటీల్లోకి పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఆనంది గరివిడి లక్ష్మి, వెంకటేష్ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్- ఏకే 47, దృశ్యం-3.. ది కంక్లూజన్, హనుమాన్ అంశ్ వంటి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటే ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ శుక్రవారం (నవంబర్ 27) ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తమిళ్ సిరీస్. గతంలో ‘కూసే మునిసామి వీరప్పన్’ డాక్యుమెంటరీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయచంద్ర హష్మి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించడం విశేషం. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక కాలనీ వాసులే డిటెక్టివ్‌లుగా మారి ఓ అమ్మాయి మిస్సింగ్ కేసును ఎలా చేధించారన్న పాయింట్ తో ఈ స్టోరీ సాగుతుంది. వరుణ్ (అశ్విన్ కుమార్), నికిత (సింధు కుమరేశన్) అనే కొత్త జంట ఒక ప్రశాంతమైన కాలనీలోకి అద్దెకు దిగుతారు. నికిత అందరితో కలుపుగోలుగా ఉంటూ త్వరగానే కాలనీలోని వాళ్లతో పరిచయం పెంచుకుంటుంది. అయితే ఆమె భర్త వరుణ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాడు. అతని ప్రవర్తన అక్కడున్న వారందరినీ షాక్ కు గురి చేస్తుంది. అదే కాలనీలో ఉండే అర్చన (అర్చన రవిచంద్రన్) ఒక క్రైమ్ పాడ్‌కాస్టర్. వరుణ్ ప్రవర్తనను గమనించిన ఆమెకు ఆ ఇంట్లో ఏదో జరుగుతోందనే అనుమానం మొదలవుతుంది. ఇంతలో ఒకరోజు నికిత అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో ఆమె ఏమైందో తెలుసుకోవడానికి అర్చనతో పాటు కాలనీ వాసులు రంగంలోకి దిగుతారు. మరోవైపు నికిత భర్త వరుణ్ పై కూడా అందరూ అనుమానపడతారు. మరి నికిత ఏమయ్యింది? ఆమె మిస్సింగ్ వెనకాల మిస్టరీ ఏంటి? చివరికీ కాలనీ వాసులకు ఎలాంటి నిజాలు తెలిశాయి? అన్నదే ఈ సిరీస్ మిగతా కథ.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఆక్టోపస్’ (Octopus). జయచంద్ర హష్మి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అశ్విన్ కుమార్ వరుణ్‌గా, సింధు కుమరేశన్ నికితగా, అర్చన రవిచంద్రన్ అర్చనగా, వినోద్ కిషన్ భరత్‌గా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం ఒరిజినిల్ తమిళ్ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడే చూడాలనుకుంటే ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. మిస్సింగ్ కేసులు, అనుమానాలు, ఊహించని మలుపులతో సాగే ఈ సిరీస్ పై ఓ లుక్కేయండి మరి.
అక్టోపస్ వెబ్ సిరీస్ ట్రైలర్..
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.