Headlines

టూరిస్ట్ కేంద్రాల్లో పండగ సందడి.. వచ్చే ఏడాది నుంచి ఫెస్టివల్స్‌కు ప్రభుత్వం ప్లాన్


ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఫెస్టివల్స్ నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ ఉత్సవాల ద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీలో జనవరిలో ఒక పండుగను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. విదేశీ పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చే ఈ శాంక్చురీకి మరింత ప్రాచుర్యం కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పల్నాడు జిల్లాలోని కొండవీడు కోట వద్ద ఫిబ్రవరి 13, 14 తేదీలలో రెండు రోజుల పాటు కొండవీడు ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు హెలి రైడ్స్, స్థానిక ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో కూడా బీచ్ ఫెస్టివల్‌ను త్వరలో నిర్వహించనున్నారు. గోవా తరహా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ. 100 కోట్లతో బీచ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మూడు ఉత్సవాల నిర్వహణకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయల నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పర్ఫెక్ట్ ఓనర్…ఇళ్ల అద్దెతో నెలకు రూ. 75 లక్షలు సంపాదన!

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూపీఐ, ఏటీఎం ద్వారా సులభంగా విత్‌డ్రా

పేద పిల్లల కోసం అమెరికా కార్పొరేట్ దిగ్గజాల పెద్ద మనసు

కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో మరో వింత పార్టీ హల్‌చల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *