టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఈఎన్ఈ రిపీట్ “. యంగ్ హీరో విశ్వక్ సేన్ సహా అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. అలానే వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు. 2018లో వచ్చిన “ఈ నగరానికి ఏమైంది” సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు 14 ఏళ్లుగా ఉన్న ఓ రికార్డును ఈ మూవీ బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
నవంబర్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్..
కాగా తెలుగులో నవంబర్ నెలలో హయ్యెస్ట్ గ్రాస్ అందుకున్న సినిమాగా ” ఈఎన్ఈ రిపీట్ ” నిలిచింది. గతంలో ఈ రికార్డు నాగార్జున హీరోగా నటించిన “ఢమరుకం” సొంతం చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించారు. ఆ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఛార్మీ స్పెషల్ సాంగ్ చేశారు. 2012 నవంబర్ 23న రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.48 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే గత 14 ఏళ్లుగా ఆ చిత్రం సొంతం చేసుకున్న ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయిందట. కానీ ఇప్పుడు “ఈఎన్ఈ రిపీట్” రూ.కోట్లకు పైగా సాధించి కొత్తా రికార్డ్ సెట్ చేసిందని పోస్ట్ చేశారు.
ఈ మేరకు ఆ పోస్టులో.. నవంబర్ లో బిగ్గెస్ట్ తెలుగు బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. 14 ఏళ్ల రికార్డు బద్దలైంది. నవంబర్ నెలలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా “ఈఎన్ఈ రిపీట్” నిలిచిందని మేకర్స్ రాసుకొచ్చారు. అలానే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా సాధించినట్టు ఎక్స్ ( ట్విట్టర్ ) లో పోస్ట్ చేశారు. మరి ఫైనల్ రన్ లో ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో అని జోరుగా చర్చ నడుస్తోంది.
November has its Biggest Telugu Blockbuster ❤️🔥❤️🔥
14 Year Old Record Broken and #ENERepeat Stands Tall as November’s Highest Grossing Telugu Film 💥💥
#BlockbusterENERepeat #ENE2
#TharunBhascker @VishwakSenActor @AbhinavGomatam @maganti_srinath #VenkateshKakumanu @anishaambrose @ShivathmikaR #VivekSagar @SOriginals1 @rootnodecinema @EneRepeat @thinkmusicindia
— S Originals (@SOriginals1) November 27, 2026
ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. పెళ్లిచూపులు మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. అ తర్వాత ఈ నగరానికి ఏమైందితో యూత్‌కు మరింత దగ్గరయ్యాడయ్యాడనే చెప్పాలి. అలానే నటుడిగా మారి కీడా కోలా, ఓం శాంతి శాంతి, క్రేజీ కల్యాణం చిత్రాలతో మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా ENE రిపీట్ తో మళ్లీ గట్టి హిట్ హిట్ సత్తా చాటారు. తరుణ్ సినిమాల్లో న్యాచురల్ డైలాగ్స్, యూత్ లైఫ్‌స్టైల్, క్యారెక్టర్ల బిహేవియర్ చాలా మామూలుగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు అంత బాగా కనెక్ట్ అవుతున్నారని అంటున్నారు.