Headlines

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!


OG యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుందా..? పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..? పుట్టిన రోజు నాడు కోరుకున్న అప్‌డేట్ అయితే రాలేదు కానీ చూసి పండగ చేసుకునే అప్‌డేట్ అయితే కచ్చితంగా వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా సుజీత్ వదిలిన ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. మరి ఈ భారీ సీక్వెల్ విశేషాలేంటో చూద్దామా..? ఓజీ సీక్వెల్ గురించి వద్దన్నా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. షూటింగ్ ఎప్పుడు, సినిమా మొదలయ్యేదెప్పుడు ఇలాంటివేం లేకపోయినా.. కథాపరంగా మాత్రం హింట్ బాగానే ఇచ్చారు మేకర్స్. ఓజి సీక్వెల్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని.. కానీ అందులో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎమోషన్స్, వెస్ట్రన్ ప్రెజెంటేషన్ ఉంటాయని తమన్ ఈ వీడియోలో వివరించారు. సుజీత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఈ ఓజీ యూనివర్స్ గురించి పవన్‌తో వీళ్లు చేసిన క్రియేటివ్ డిస్కషన్ ఫ్యాన్స్‌కి కిక్కిస్తుంది. నేతాజీ రిఫరెన్స్ కూడా ఉంటుందని పవన్ స్వయంగా చెప్పడంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. ఈ కాన్సెప్ట్ విన్నాక పవన్ కూడా ఉత్సాహంగా.. మనం ది బెస్ట్ అవుట్‌పుట్ ఇద్దాం అంటూ యూనిట్‌కి ఫుల్ జోష్ ఇచ్చారు. ఈ వీడియోలో చూపించిన యానిమేటెడ్ సమురాయ్ విజువల్స్ ఓజి యూనివర్స్‌ ఎలా ఉండబోతుందో ఓ హింట్ ఇచ్చింది. దీనికి తోడు తమన్ ఈసారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో క్లాసికల్ టచ్ ఇచ్చారు.. ఇది వీడియోను మరింత ఇంపాక్ట్ ఇచ్చేలా మార్చేసింది. అన్నీ చెప్పినా.. ఓజీ 2 సెట్స్‌పైకి వచ్చేదెప్పుడనే విషయాన్ని మాత్రం దాచేసారు మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: వాచ్‌మెన్‌ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది

బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్‌ ఎవరికి?

ఆ చేపలను తినకండి.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక!

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *