Headlines

Hyderabad: కూకట్‌పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. 8 బైకులు ధ్వంసం..


Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులపైకి కారుదూసుకెళ్లడంతో ఏకంగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బ్రిజా కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న బైకులను వరుసగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైకులు ఒక్కొక్కటిగాకిందపడిపోయాయి. కొన్ని బైకులు పూర్తిగా ధ్వంసం కాగా.. మరికొన్ని వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కారులో మద్యం బాటిల్ కూడా కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే కారు అదుపుతప్పి బైకులను ఢీకొట్టిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.

కారు బైకులను ఢీకొట్టిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో రోడ్డుపై వాహనాలు, ప్రజలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులుమండిపడుతున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు మరింతకఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు స్థానికంగాచర్చనీయాంశంగా మారాయి. రోడ్డుపై వరుసగా ధ్వంసమైన బైకులు, ప్రమాదానికి గురైన బ్రిజా కారు కనిపిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *