SBI Amrit Vrishti: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లు, సాధారణ ఇన్వెస్టర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎఫ్డీ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘అమృత్ వృష్టి’ (Amrit Vrishti). ఇది 444 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ వినియగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కేవలం 15 నెలల్లో మంచి బెనిఫిట్స్ పొందాలనుకునేవారికి ఈ ఎఫ్డీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
ఎంత వడ్డీ రేటు?
ఎస్బీఐ 444 రోజుల అమృత్ వృష్టి స్కీమ్‌లో పెట్టుబడిదారుని రకాని బట్టి వడ్డీ రేట్లను నిర్ణయించింది.
ఇందులో సాధారణ వినియోగదారులకు 6.45%, సీనియర్ సిటిజన్ల(60 ఏళ్లు దాటినవారు)కు 6.95%, అలాగే సూపర్ సీనియర్ సిటిజన్స్ (80 ఏళ్లు దాటినవారు) 7.05%. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరుల కంటే 0.50% అదనపు వడ్డీ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఈ స్కీమ్ ప్రయోజనాలు:
- తక్కువ కాలపరిమితి: కేవలం 444 రోజులు (దాదాపు 14.5 నెలలు) మాత్రమే ఈ డిపాజిట్ కాలవ్యవధి ఉంటుంది.
- కనీస పెట్టుబడి: ఈ స్కీమ్‌లో కనీసం రూ. 1,000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకునే అకాశం.
- ఫ్లెక్సిబుల్ వడ్డీ చెల్లింపులు: ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా వడ్డీని నెలవారీ, త్రైమాసిక, లేదా అర్ధసంవత్సర పద్ధతిలో తీసుకోవచ్చు.
- లోన్ సదుపాయం: అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎఫ్డీ ఆధారంగా లోన్ తీసుకునే వెసులుబ ఆటు కూడా ఉంటుంది.
ప్రీ-మెచ్యూర్ విత్‌డ్రావల్:
అవసరమైతే గడువు తీరక ముందే డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. అయితే ముందస్తు ఉపసంహరణపై కొంత పెనాల్టీ రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఈ ఎఫ్డీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
ఎస్బీఐ ఖాతాదారులు ఈ మూడు పద్ధతుల్లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు.
- YONO App ద్వారా: ఎస్బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అయి Deposits > Open Fixed Deposit లోకి వెళ్లి 444 రోజుల ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్: SBI అధికారిక నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయవచ్చు.
- బ్యాంక్ బ్రాంచ్: సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా ఫారమ్ పూర్తి చేసి అమృత్ వృష్టి ఎఫ్డీని ప్రారంభించవచ్చు.
మార్కెట్ హెచ్చుతగ్గుల భయం లేకుండా, సురక్షితమైన ప్రభుత్వ రంగ బ్యాంకులో తమ పొదుపు మొత్తాన్ని దాచుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అమృత్ వృష్టి స్కీమ్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: Pension Scheme: కేవలం నెలకు రూ.210 డిపాజిట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.5000వేల పెన్షన్..!