Headlines

NZ vs IND: ప్రోమో షూట్‌లో గాయం.. కట్‌చేస్తే.. టీమిండియాతో సిరీస్‌ నుంచి ఔట్..!


Rachin Ravindra Ruled Out: భారత క్రికెట్ జట్టు (Team India) తో తలపడేందుకు సిద్ధమవుతున్న కివీస్ శిబిరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత వారం ప్రమోషనల్ షూట్ సమయంలో భుజానికి గాయం కావడంతో న్యూజిలాండ్ (New Zealand) యువ సంచలనం రచిన్ రవీంద్ర (Rachin Ravindra) టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ అధికారికంగా ధ్రువీకరించాడు. రచిన్ కోలుకోవడానికి సుమారు 6 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. నవంబర్ 4వ తేదీన ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ నాటికి అతను తిరిగి జట్టులోకి వస్తాడని కివీస్ మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ కీలక ఆటగాడి గైర్హాజరీపై కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ రచిన్ రాబోయే కాలంలో జట్టుకు అత్యంత కీలకమని తెలిపాడు. రికవరీ ప్రక్రియను తొందరపాటు చేయకుండా జాగ్రత్త వహిస్తున్నామని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాటింగ్ బలపరిచేందుకు బెవన్ జాకబ్స్ (Bevon Jacobs) కు జట్టులో చోటు దక్కింది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన జాకబ్స్, బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన గత మ్యాచ్‌లో అజేయంగా అరవై 2 పరుగులు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఎక్కువమంది చదివనది: Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!

ఇవి కూడా చదవండి



మరోవైపు పేస్ విభాగంలో అనుభవజ్ఞడైన ఆదం మిల్నే (Adam Milne) సుమారు ఏడాది తర్వాత మళ్లీ పొట్టి జట్టులోకి పునరాగమనం చేశాడు. కివీస్ మేనేజ్‌మెంట్ వర్క్‌లోడ్ నిర్వహణపై దృష్టి సారించి భారీ ఫాస్ట్ బౌలర్ల కూర్పును సిద్ధం చేసింది. లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson), మాట్ హెన్రీ (Matt Henry), కైల్ జేమిసన్ (Kyle Jamieson), జాకబ్ డఫీ (Jacob Duffy), జాక్ ఫౌల్కేస్ (Zak Foulkes), నాథన్ స్మిత్ (Nathan Smith) తదితరులతో కూడిన పటిష్టమైన పేస్ దళాన్ని ఎంపిక చేశారు. అయితే బెన్ సియర్స్ (Ben Sears) చీలమండ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని పరిగణలోకి తీసుకోలేదు.

ఎక్కువమంది చదివనది: 5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర!

సుదీర్ఘ క్రికెట్ సీజన్ ఆరంభంలో ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ పెద్ద స్క్వాడ్ ఉపయోగపడుతుందని కోచ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా నాలుగు టెస్టులు ఆడాల్సి ఉండగా, స్వదేశంలో భారత్ సిరీస్ ముగిసిన తరువాత శ్రీలంక (Sri Lanka) తో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 16 మంది సభ్యుల కూర్పును రోటేషన్ పద్ధతిలో వాడుకోనున్నారు. ఫిన్ అలెన్ (Finn Allen), టిమ్ సీఫర్ట్ (Tim Seifert) ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న బలమైన భారత జట్టును స్వదేశంలో ఎదుర్కొనేందుకు కివీస్ పూర్తిగా సిద్ధమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *