Headlines

రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే అకౌంట్లోకి రూ.10 లక్షలు.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా ఉండదు..


సురక్షితమైన హామీతో కూడిన పెట్టుబడి కోసం చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలు అందిస్తోంది. పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు పాపులర్ అయ్యాయి. వాటిల్లో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. ఈ పథకానికి ప్రభుత్వ హాపీతో పాటు తక్కువ రిస్క్‌ ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మంచి రాబడిని ఇందులో పొందవచ్చు. ఈ పథకంలో 1988లో ప్రారంభమవ్వగా.. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కేటగిరీ కిందకు ఇవి వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి దీర్థకాలంలో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ నాటికి రూ.10 లక్షలు అవుతాయి. కనీస పెట్టుబడి రూ.వెయ్యి నుంచి మొదలవుతుంది. దీనికి గరిష్ట పరిమితి అనేది ఉండదు. సుకన్య సమృద్ధి యోజన లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులపై పరిమితులు ఉంటాయి. అయితే కిసాన్ వికాస్ పత్రలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తోంది. అవసరాన్ని బట్టి వడ్డీ రేట్లు భవిష్యత్తులో మారవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం కిసాన్ వికాస్ పత్రలో పెట్టిన పెట్టుబడి 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది.  ఈ స్కీములో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ల పేరుపై తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఖాతా తెరవవచ్చు. ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టే అవకాశముంది. NRIలకు ఇందులో పెట్టుబడి పెట్టడానికి అనుమతి లేదు. సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకును సందర్శించి కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరవచ్చు. ఆధార్, పాన్ కార్డ్, చిరునామా రుజువు వంటి KYC పత్రాలు సమర్పించి ఖాతా తెరవొచ్చు. ఇక ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్ట్ ఆఫీస్‌కు లేదా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కూడా ఈ ఖాతాను బదిలీ చేయవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో 2 సంవత్సరాల 6 నెలలు పూర్తయిన తర్వాత మీ పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు.  అయితే కొన్ని జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.  ఇక ఇందులో పెట్టుబడి పెట్టేవారికి రుణ సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో మీ పెట్టుబడిపై రుణం పొందవచ్చు. ఇక KVPపై TDS అనేది వర్తించదు. అయితే మెచ్యూరిటీ నాటికి వచ్చే వడ్డీ మీ ఆదాయ స్లాబ్ ప్రకారం పన్ను ఉంటుంది. KVP కాంపౌండ్ వడ్డీని కూడా అందిస్తుంది. వాస్తవ రాబడి 7.5 శాతం కంటే ఎక్కువగా ఉన్నా.. 9 శాతం వరకు ఉండవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *