Headlines

ATM Cards: ఏటీఎం కార్డు ఉన్నా వాడటం లేదా..? ప్రతీ ఏడాది ఛార్జీలు కట్టాల్సిందే.. ఎంత పడతాయంటే..?


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఏటీఎం కార్డు ఉండి వాడకపోయినా ఛార్జీలు పడనున్నాయి. చాలామంది ఏటీఎం కార్డు తీసుకుని దానిని వాడకుండా పక్కన పడేస్తారు. లేదా వ్యాలెట్‌లో అలాగే ఉంచుకుంటారు. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏటీఎం కార్డుల వాడకం బాగా తగ్గిపోయింది. ఏదైనా అత్యవసరమైతే తప్ప డెబిట్ కార్డులను ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదు. ఏటీఎం కార్డు వాడకపోతే ఛార్జీలు పడవని చాలామంది అనుకుంటారు. అయితే అది పూర్తిగా తప్పు. డెబిట్ కార్డు తీసుకున్న తర్వాత రెండో ఏడాది నుంచి వార్షిక మెయింటనెన్స్ ఛార్జీలను ఎస్బీఐ విధిస్తోంది. మీ కార్డు టైప్, వేరియంట్‌ను బట్టి ఛార్జీలు ఉంటాయి.

ఇక వార్షిక చార్జీలే కాకుండా కార్డు పోతే రీప్లేస్‌మెంట్ చేసుకోవాలన్నా, విదేశాల్లో లావాదేవీలు చేసినా ఛార్జీలు విధిస్తారు. ఉచిత పరిమితికి మించి ఏటీఎంలలో ఏదైనా లావాదేవీలు చేసినా ఛార్జీలు పడతాయి. బ్యాలెన్స్ లాంటివి చెక్ చేసుకున్నా రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. మీరు కార్డును వాడకపోయినా వార్షిక రుసుంలు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఒక్కొ కార్డుకు ఒక్కొలా ఈ రుసుంలు అనేవి ఉంటాయి. ఉదాహరణకు గ్లోబల్, సిల్వర్, క్లాసిక్ వంటి సాధారణ రకం డెబిట్ కార్డులకు వార్షిక రుసుం అనేది రూ.200 నుంచి రూ.250 వరకు ఉండొచ్చు. ఇక మాస్టర్ కార్డ్ వరల్డ్, వీసా ఇన్పినిట్, ప్లానినమ్, గ్లోబల్ గోల్డ్ వంటి ప్రీమియం కార్డులకు రూ.300 నుంచి రూ.800 వరకు వార్షిక ఛార్జీలు విధిస్తారు. విదేశాల్లో ఉపయోగిస్తే కనీస రుసుంతో పాటు లావాదేవీ మొత్తంలో నిర్దిష్ట శాతంను బట్టి ఛార్జీలు కట్ అవుతాయి. ఇక ట్రావెల్ కార్డులకు జారీ, రీలోడింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి.

కార్డు వాడకపోతే వార్షిక రుసుంలు పడవనే భ్రమలో చాలామంది ఉంటారు. కానీ అది పూర్తిగా తప్పు. మీరు కార్డు వాడకపోయినా ఈ రుసుంలు అనేవి పడుతూనే ఉంటాయి. దీంతో డెబిట్ కార్డు తీసుకునేటప్పుడు వార్షిక రుసుంల గురించి తెలుసుకోండి. మీకు అవసరమైతేనే కార్డు తీసుకోండి. అవసరం లేకపోతే తీసుకోకండి. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఏటీఎం కార్డుల వినియోగం తగ్గిపోతుంది. దీంతో చాలా బ్యాంకులు ఏటీఎంలను కూడా తగ్గించేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏటీఎంలు మరింత తగ్గే అవకాశముంది. అయితే బ్యాంక్ సెలవు రోజులు, డిజిటల్ లావాదేవీలు పనిచేయనప్పుడు ఏటీఎంలను ఉపయోగిస్తుంటారు. నెలకు నాలుగు లేదా ఐదు లావాదేవీల వరకు ఏటీఎం కార్డు ద్వారా ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జీలు పడతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *