కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ C, ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యం డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని కొన్ని ఆహారాలతో పాటు తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను మనం పొందలేమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకపోగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు.