Census 2027: ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి?

Census 2027: ఊర్లో అమ్మనాన్నలు, సిటీలో పిల్లలు.. జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి?


Census 2027: ‘ఊర్లో అమ్మనాన్నలు, హైదరాబాద్‌లో నేను’..జనగణనలో ఎక్కడ నమోదు చేసుకోవాలి? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. తల్లిదండ్రులు సొంత గ్రామాల్లో నివసిస్తుండగా, పిల్లలు ఉద్యోగాలు లేదా విద్య నిమిత్తం వేరే నగరాల్లో ఉంటున్నప్పుడు జనగణన నమోదు ప్రక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జనగణన నిర్వహణకు కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. అలాంటి సమయంలో ఎవరు ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం..

జనగణనలో మూల మంత్రం “సాధారణ నివాసం” (Ordinary Residence). దీని అర్థం ఒక వ్యక్తి సాధారణంగా ఎక్కడ నివసిస్తున్నాడో, అక్కడే అతడిని జనగణనలో నమోదు చేయాలని ఐఏఎస్‌, తెలంగాణ జనగణన విభాగం సంచాలకులు భారతి హోళికేరి, వెల్లడించారు. ఈ నియమం వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి: ప్రతి ఒక్కరిని లెక్కించడం, అలాగే ఎవరిని కూడా రెండోసారి లెక్కించకుండా డూప్లికేషన్‌ను నివారించడం. ఏ డాక్యుమెంట్‌ను కూడా జనగణనలో అడగరు కాబట్టి, పత్రాలు ఎక్కడ ఉన్నాయనేది నమోదు ప్రాంతానికి ప్రామాణికం కాదు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ, అక్కడే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి సొంతూరులో ఇల్లు ఉంది. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు వంటి పత్రాలన్నీ ఇంకా ఆ ఊరి చిరునామాతోనే ఉన్నాయి. అతడు ఐదేళ్లకు ఒకసారి ఊరికి వెళ్లి ఓటు వేసి వస్తాడు. ఈ సందర్భంలో ఆ వ్యక్తి సాధారణంగా నివసిస్తున్న హైదరాబాద్‌లోనే అతడి జనగణన నమోదు జరుగుతుంది. ఊరిలోని సొంత ఇల్లు లాక్ చేసి ఉండవచ్చు లేదా అద్దెకు ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఇల్లు అద్దెకు ఉంటే, ప్రస్తుతం అద్దెకు ఉంటున్న వారి నమోదు అక్కడే జరుగుతుంది. వ్యక్తి రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ ఐడీలకు జనగణన నివాసానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆమె వివరిస్తున్నారు.

రెండవ కేసులో తల్లిదండ్రులు గ్రామంలో నివసిస్తూ ఉండగా, వారి పిల్లలు చదువు లేదా ఉద్యోగం కోసం వేరే నగరంలో ఉంటారు. ఈ పిల్లలు హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు లేదా షేర్డ్ ఫ్లాట్స్‌లో నివసించవచ్చు. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు గ్రామంలోనే జనగణనలో నమోదు అవుతాయి. పిల్లలు మాత్రం వారు ప్రస్తుతం సాధారణంగా నివసిస్తున్న ప్రాంతంలో నమోదు అవుతారన్నారు. ఒకవేళ పిల్లలు షేర్డ్ ఫ్లాట్స్‌లో ఉంటే, వాటిని సాధారణ గృహాలు (Normal Households) కింద పరిగణించి నమోదు చేస్తారు. అదే పిల్లలు హాస్టళ్లు లేదా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్నట్లయితే వారందరినీ “సంస్థాగత గృహాలు” (Institutional Households) కింద కవర్ చేయడం జరుగుతుంది. ఈ మార్గదర్శకాలు పౌరులు తమ జనగణన నమోదును సరైన ప్రదేశంలో చేయించుకోవడానికి స్పష్టతను అందిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *