Headlines

Indiramma Houses: వారంలోనే ఇందిరమ్మ ఇళ్లు.. రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. తొలి ప్రాధాన్యత వారికే!

Indiramma Houses: వారంలోనే ఇందిరమ్మ ఇళ్లు.. రెండో విడతపై బిగ్‌ అప్‌డేట్.. తొలి ప్రాధాన్యత వారికే!


సొంతిళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇళ్లు.. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడతలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన సర్కార్ రెండో విడత ఇళ్ల మంజూరుకు కూడా సిద్ధమైంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సొంతిల్లు లేక పూరిగుడిసెల్లో, తాత్కాలిక నివాసల్లో జీవనం కొనసాగిస్తున్నారని.. రెండో విడతలో భాగంగా వీరందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తొలి పాధాన్యత మాత్రం పూరిళ్లలో నివసించే వారికేనని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 82,890 కుటుంబాలకు పూరిళ్లలో నివసిస్తున్నాయని.. కానీ వీరిలో నిజంగా అర్హులైన వారు కేవలం 43 వేల కుటుంబాటు మాత్రమేనని అధికారుల సర్వేలో స్పష్టమైంది..దీంతో వీరితే తొలుత పక్కా ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికారిక సర్వే ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 5,421 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్టు తేలింది. ఇక భూపాలపల్లిలో 3,328 కుటుంబాలు, నల్గొండలో 3,142 కుటుంబాలు, మెదక్ జిల్లాలో 2,955 కుటుంబాలు ఇప్పటికీ సొంతిల్లు లేక పూరిళ్లలో నివపిస్తున్నారు. అంతేకాదు జగిత్యాల జిల్లాలో 356, కరీంనగర్‌లో 359, రాజన్న సిరిసిల్లలో 399 కుటుంబాలు గుడిసెలలో నివసిస్తున్నట్టు అధికారుల సర్వేలో తేలింది.

అయితే రెండో విడతలో మొత్తం 2.50 లక్షలు ఇళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. వీటిలో పూరిళ్లలో నివసిస్తున్న పేద ప్రజలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు మొత్తం 43వేల లబ్ధిదారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. వారి జాబితాను త్వరలోనే ఆయా జిల్లాల్లోని ఎంపీడీవోలకు హౌసింగ్ శాఖ అధికారులు పంపనున్నారు. వాటిని జిల్లా కలెక్టర్లు పరిశీలిం.. ఇంఛార్జ్ మంత్రులకు అందజేస్తారు. అక్కడ వారు వాటిని ఆమోదించి లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తారు. అయితే ఈ ప్రక్రియలను వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *