బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు. అమెరికా-ఇరాన్ యుద్దం మళ్లీ స్టార్ట్ అవ్వడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో.. వీటి ప్రభావం పసిడి ధరలపై పడింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్లు ప్రకటిస్తున్న క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ఈ పెరుగుదల మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. జులై 23న కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,280 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.770 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,35,000 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.700 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతూ వస్తోన్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,520 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,310గా ఉంది. చెన్నైలో స్వల్పంగా పెరిగాయి. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,280 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.35 లక్షల వద్ద ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,420 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,150గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,280 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.35 లక్షలుగా ఉంది. అటు వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి.
దేశీయ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద ఉంది. హైదరాబాద్లో నిన్న కేజీ సిల్వర్ రూ.2,45,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.45 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.2,45,100 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.2.45 లక్షల వద్ద కొనసాగింది.




