తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. ఇప్పుడు మరో రైలును అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఈ రైలు మచిలీపట్నం-తిరుచానూరు(07440/07439) మధ్య సర్వీసులు అందించనుంది. ఈ స్పెషల్ ట్రైన్ ప్రతీవారం వీకెండ్స్‌లో అందుబాటులో ఉంటాయి. మచిలీపట్నం-తిరుచానూరు రైలు శుక్రవారం, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుచానూరు-మచిలీపట్నం రైలు శనివారం, ఆదివారం సర్వీసులు అందించనుంది. తిరుమల వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పవచ్చు. ఈ రైలు టైమ్ షెడ్యూల్ వివరాలు తెలుసుకుందాం.
షెడ్యూల్ ఇదే..
మచిలీపట్నం-తిరుచానూరు(07440) ట్రైన్ మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు ప్రారంభమవుతుంది. గుడివాడకు 5.23 గంటలకు, విజయవాడకు 6.20 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత తెనాలికి 7 గంటలకు, చీరాలకు 7.48 గంటలకు, ఒంగోలుకు 8.48 గంటలకు, నెల్లూరుకు 10.28 గంటలకు, రేణిగుంటకు అర్థరాత్రి 1 గంటలకు చేరుకోనుండగా.. తిరుచానూరుకు 2 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుచానూరు-మచిలీపట్నం ట్రైన్(07439) రైలు తిరుచానూరులో ఉదయం 3.30 గంటలకు బయల్దేరుతుండగా..విజయవాడకు 11 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నంకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
గుంటూరు-చర్లపల్లి ప్రత్యేక రైలు..
అటు గుంటూరు-చర్లపల్లి(07227/07228) స్పెషల్ రైలు కూడా ప్రకటించారు. ఇది ప్రతీ ఆదివారం సర్వీసులు అందించనుంది. గుంటూరు-చర్లపల్లి(07227) ట్రైన్ ఆదివారం రాత్రి గుంటూరులో రాత్రి 9.45 గంటలకు బయల్దేరి..చర్లపల్లికి ఉదయం 4 గంటలకు చేరుకుంటుంది. ఇక చర్లపల్లి-గుంటూరు(07228) ట్రైన్ ప్రతీ సోమవారం చర్లపల్లిలో రాత్రి 11.50 గంటలకు బయల్దేరి.. గుంటూరుకు ఉదయం 6.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగుతుంది.