“ఏదైనా జరుగుతుందేమో అన్న ఆశతో ఆ డ్రెస్ వేసుకున్నాను. నేను స్నానం చేస్తూ మధ్యలోనే వచ్చి డ్రెస్ వేసుకున్నానా.? అని చాలామంది అడిగారు. నిజానికి అదే జరిగింది” అంటూ ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. అయితే ఆ డ్రెస్ విషయంలో తనకు సలహాలు ఇచ్చేందుకు స్టైలిస్ట్, స్నేహితులు, మేనేజర్లు అందరూ అక్కడే ఉన్నారని ఐశ్వర్య తెలిపారు. తన స్టైలిస్ట్ మరో చోకర్ వేసుకోవాలని, జుట్టును వదిలేయాలని సూచించారని చెప్పారు. తన స్నేహితులు, మేనేజర్లు కూడా ఆ డ్రెస్ విషయంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారని వెల్లడించారు. అయినా చివరకు ఆ డ్రెస్‌ను ఎంచుకున్నది మాత్రం తానేనని ఐశ్వర్య స్పష్టం చేశారు.