Headlines

Hyderabad: వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు మెట్రో రైల్ శుభవార్త!


భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 25, శనివారం నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. అయితే చివరి రైళ్లు ఒంటి గంటకు తమ గమ్యస్థానంలోని చివరి స్టేషన్‌కు చేరుకునేలా సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసు సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను బట్టి కొన్ని స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మేరకు అదనపు రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు సాధారణ సమయానికి తిరిగి ప్రారంభమవుతాయని మెట్రో రైల్ అధికారులు స్పష్టం చేశారు.

Hyderabad Metro Timing

Hyderabad Metro Timing

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *