Headlines

ఎసిడిటీని మాయం చేసి జీర్ణసమస్యకు చెక్‌ పెట్టే అమృత ఫలం.. వారానికి ఒక్కటి తంటే..


వెలగ పండు.. దీన్నే ఆయుర్వేదంలో కపిత్త ఫలంగా పిలుస్తారు. దీనికి మరో పేరు కూడా ఉంది అమరత్వ ఫలం అని.. బయట గట్టి పెంకుతో కనిపించే ఈ పండును పగలగొట్టడం కాస్త కష్టమైనప్పటికీ.. లోపల దాగి ఉన్న గుజ్జులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆధునిక జీవనశైలిలో కలుషితమైన గాలి, నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా కాలక్రమేణా శరీరంలో పేరుకుపోయి వ్యర్థాలను తొలగించడంలో ఈ పండు చాలా బాగా పని చేస్తుంది. ఈ పండు గుజ్జులో ఉండే అరుదైన టానిన్‌లు, సహజ పెక్టిన్ ఒక అయస్కాంతంలా పనిచేసి ఈ విష రసాయనాలను బంధిస్తాయి. అనంతరం వాటిని మూత్రం, మలం ద్వారా దేహం నుంచి పూర్తిగా బయటకు పంపి శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేస్తాయి.

మహిళల ఆరోగ్యానికి రక్షణ కవచం

వెలగ పండులోని శక్తివంతమైన పాలిఫెనాల్స్ మహిళల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి మహిళల్లో రొమ్ము, గర్భాశయ కణజాలాలను ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శరీరంలో హానికరమైన కణాల పెరుగుదలను నిరోధించి, కణాలకు నష్టం జరగకుండా ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి.

జీర్ణవ్యవస్థకు అమృతం

తీవ్రమైన కడుపుమంట, ఎసిడిటీ, పేగుల్లోని మొండి పుండ్లతో బాధపడేవారికి వెలగ పండు గుజ్జు నిజంగా ఒక అమృతంలా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని వేడిని లాగేసి, కడుపును చల్లబరుస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పేగు గోడలను బలోపేతం చేసి, మంటను తగ్గిస్తాయి. తద్వారా జీర్ణక్రియను శుద్ధి చేసి క్రమబద్ధీకరిస్తుంది.

ఎలా ఆహారంగా తీసుకోవాలి?

వెలగ పండు పెంకును జాగ్రత్తగా పగలగొట్టి లోపలి గుజ్జును నేరుగా తినవచ్చు. దీని పుల్లని, వగరు రుచికి కాస్త తాటి బెల్లం కలుపుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది. అంతేకాకుండా, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి రుచికరమైన వెలగ పండు పచ్చడిలా చేసుకుని వారానికి ఒకటి లేదా రెండుసార్లు భోజనంలో హ్యాపీగా ఆస్వాదించవచ్చు. దీని సువాసన, రుచి జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా కడుపును చల్లగా ఉంచుతాయి. పల్లెల్లో అతి చౌకగా లభించే వెలగ పండు.. ప్రకృతి మనకు ప్రసాదించిన నిజమైన రక్షణ కవచం. దీన్ని మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *