Headlines

‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..!

‘ప్రైవేట్ క్లాస్‌కు రమ్మని వేధించిన లెక్చరర్‌కు చెప్పుల దండ, చీపురుతో సన్మానం..!


పశ్చిమ బెంగాల్‌లోని గోబర్దంగా హిందూ కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. కళాశాలలో భూగోళశాస్త్రం బోధించే అతిథి అధ్యాపకుడు సందీప్ దత్తాపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు అతడిని క్యాంపస్‌లో ఊరేగించారు. చీపురు కర్రలతో కొట్టి, చెప్పుల దండ వేశారు. గుడ్లతో దాడి చేశారు.విద్యార్థుల నిరసన అనంతరం అధ్యాపకుడిని పోలీసులకు అప్పగించారు. గోబర్దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

తనను అధ్యాపకుడు ఫోన్ ద్వారా పదేపదే వేధించాడని, అనుచితంగా మాట్లాడాడని ఓ విద్యార్థి ఆరోపించింది. తనతో సంబంధం కొనసాగించాలంటూ, ఇంట్లో ఉచితంగా వ్యక్తిగత ట్యూషన్ చెబుతానని ప్రతిపాదించాడని విద్యార్థిని పేర్కొంది. అదనపు ట్యూషన్ అవసరం లేదని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత, తనను ఫెయిల్ చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని ఇతర సీనియర్ విద్యార్థులకు చెప్పడంతో అధ్యాపకుడిని నిలదీశారు. ఆ తర్వాత విద్యార్థులు అధ్యాపకుడిని కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో విద్యార్థులు అతడిని చుట్టుముట్టి నిరసన తెలుపుతున్న దృశ్యాలు కనిపించాయి.

మరోవైపు, మహిళా విద్యార్థులను బెదిరిస్తూ ఎక్కడ ఫిర్యాదు చేసినా తనకు ఎలాంటి నష్టం జరగదని అధ్యాపకుడు చెప్పినట్లు మరికొందరు విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం కావాలని, ఆరోపణలు నిజమని తేలితే అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తూ, సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు. ఆరోపణలు, విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *