Headlines

Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్!

Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్!


Gold, Silver Prices: అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికన్ డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేసుకోవడం మరియు అమెరికా-ఇరాన్ మధ్య సడలింపు చర్చల వార్తల ప్రభావంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఉప్పుడున్న ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో దిగి వచ్చాయి. దీంతో వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిందనే చెప్పాలి.

రెండు నెలల కిందట అంటే జూన్‌ 1వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగానే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,220 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,200 వద్ద ఉండేది. అయితే చెన్నైలో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ వరుసగా రూ.1,58,180, 1,45,000 వద్ద ఉండేది. అయితే మే 31 నాటి ధరలతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ. 820 నుండి రూ. 1,420 వరకు తగ్గుదల నమోదైంది. అంటే ఈ రెండు నెలల్లో ఏకంగా 13 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది.

ఇది కూడా చదవండి: Telangana: విద్యుత్‌ షాక్‌తో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా పెంపు.. TGSPDCL కీలక ప్రకటన

ఇవి కూడా చదవండి



ఇక జూన్‌ 1 నుంచి 10వ తేదీల మధ్య బంగారం ధరలను పరిశీలిస్తే పది రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టింది. జూన్‌ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల ధరను పరిగణలోకి తీసుకుంటే.. రూ.1,47,770 వద్ద ఉంది. అంటే కేవలం పది రోజుల్లో 9 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అదే జూన్‌ 30వ తేదీన ఇదే బంగారం ధర రూ.1,42,040 వద్దకు చేరుకుంది. ఆ తర్వాత కొంత పెరుగుదల నమోదైంది. ఇక జూలై 1 తేదీన ఇంకా తగ్గుముఖం పట్టింది. తులం ధర ఏకంగా రూ.1,40,780 వద్దకు చేరుకుంది. ఇక జూలై 20వ తేదీన మళ్లీ జోరందుకుంది. తులం ధర రూ.1,43,460 వద్ద ట్రేడయ్యింది. ఇలా ధరలను పరిశీలిస్తే గత రెండు నెలల్లో భారీగానే తగ్గింది.

ఇక వెండి ధర విషయానికొస్తే.. జూన్‌ 1వ తేదీన కిలో వెండి ధర 2,80,000 వద్ద కొనసాగింది. ప్రస్తుతం అంటే జూలై 30వ తేదీన చూస్తే.. కిలో వెండి ధర రూ.2,34,800 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ రెండు నెలల్లో ఏకంగా రూ.45 వేలుపైగా తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధరను జూలై 10వ తేదీన చూస్తే భారీగా దిగి వచ్చింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,40,000 వద్దకు చేరుకుంది. ఇలా అప్పటి ఇప్పటి ధరతో పోలిస్తే భారీగా మొత్తంలో తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.

అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ పుంజుకోవడంతో సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడంతో షార్ట్-టర్మ్ ఇన్వెస్టర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో మార్కెట్లలో అనిశ్చితి కొంత తగ్గింది. గరిష్ఠ ధరల కారణంగా స్థానిక మార్కెట్లలో ఆభరణాల కొనుగోళ్లు తగ్గిపోవడం కూడా ధరల పతనానికి ఒక కారణమైంది.

ఇది కూడా చదవండి: Swiggy Instamart: సూపర్‌ గుడ్‌న్యూస్‌.. ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్‌ సిలిండర్లు.. 10 నిమిషాల్లోనే డెలివరీ..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *