Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు


బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్‌ ఛాన్స్‌. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. వెండి రేటు రూ.15000 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, డాలర్ వంటి కారణాలు బంగారం ధరలు తగ్గేలా చేస్తున్నాయి. ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ.600 వరకు తగ్గింది. కేజీ వెండిపై రూ.100 మాత్రమే తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు ఎప్పుడు పడుతుందోనని భారత్ వంటి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి. చమురు, గ్యాస్ సహా పలు వస్తువుల దిగుమతుల్లో అంతరాయాలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే, ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు బులియన్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సాధారణంగా ఉద్రిక్తతలు ఉంటే ధరలు పెరుగుతాయి. కానీ, ఇరాన్ యుద్ధం సమయంలో ఊహించని విధంగా బంగారం ధరలు మారుతుండడం గమనార్హం. ప్రధానంగా ట్రంప్ చేసే ప్రకటనలు బంగారం ధరలను నడిపిస్తున్నాయని చెప్పవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా పలు కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదన్న అంచనాలూ బంగారంలోని పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నాయి. అలాగే రష్యా భారీగా బంగారం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి ఒక్కసారిగా బంగారం రావడం సైతం ధరలు తగ్గేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈరోజు ఏప్రిల్‌ 24న స్పాట్‌ గోల్డ్‌ ఔన్సుకు 30 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ బంగారం రేటు ఇవాళ 4675 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.53 శాతం తగ్గి 75 డాలర్ల వద్దకు పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ దిగివచ్చాయి. నాలుగు రోజుల్లో తులం బంగారం రేటు రూ. 2800 మేర పడిపోయింది. ఇక ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు మరో రూ. 600 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాములు బంగారం రేటు రూ. 1,52,950 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 550 మేర తగ్గడంతో తులం రేటు రూ. 1,40,200 వద్దకు పడిపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. ఒకనొక సందర్భంలో పసిడి ధరలు ఆల్‌టైం హైకి రూ.2లక్షలకు చేరువలోకి వెళ్లగా, కేజీ వెండి రూ.4,25,000కు చేరింది. ఎలక్ట్రికల్స్‌-ఎలక్ట్రానిక్స్‌, ఆటో-ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌, సోలార్‌ ఎనర్జీ, సెమీకండక్టర్‌, మెడిసిన్‌, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్‌లు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలలో వెండి వినియోగం బాగా పెరగడం, వెండి మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరగటంతో అప్పట్లో ఈ డిమాండ్ ఏర్పడింది. బంగారంతో పోల్చితే వెండి నాణ్యత అధికం కావడం, అందులో వేస్టేజ్ అనేది ఉండకపోవటంతో బార్స్ రూపంలో వెండిని కొనేవారి సంఖ్య బాగా పెరిగారు. కొందరు ఈటీఎఫ్‌ రూపంలోనూ వెండిపై పెట్టుబడి పెట్టడంతో అప్పట్లో వెండి ధర ఆకాశాన్ని అంటింది. కానీ యుద్ధం మొదలయ్యే నాటికే వెండి ధర క్రమంగా పతనమవుతూ వచ్చింది. అయితే.. గత రెండ్రోజుల్లో బంగారంతో పాటు వెండి రేటు వరుసగా పడిపోతోంది. గత నాలుగు సెషన్లలో కిలో వెండి రేటు రూ.15000 మేర దిగివచ్చింది. ఇవాళ ఒక్కరోజే రూ. 5000 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 2,65,000 వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది.విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,200 ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,350 ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!

ఆధార్ నెంబర్‌ ఉంటే.. డబ్బులు డ్రా చేయచ్చా ??

Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం

Millionaire Tips: ఈ 8 ఖర్చులు ఆపేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *