- ‘‘పంటో.. గడ్డో..
- పాపమో..పుణ్యమో..
- తను నాటింది..తనే నరుక్కోవాలి..
- నేను నాటిన విత్తనం ఇప్పుడు కోత కొచ్చింది..
- అంత కంటే ముందు నామీద పడ్డ మచ్చని తుడిచేయాలి..
- నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి.. నా పేరు కరసామి’’
అని ఓ యువకుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ కరసామి మీద పడ్డ మచ్చ ఏంటి? అతను తనకు ఎదురైన సమస్యను ఎలా దాటి తనపై పడ్డ మచ్చను తుడుచుకున్నాడు.. అనేది తెలుసుకోవాలంటే వెర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు.
ధనుష్‌కి జోడీగా మమితా బైజు నటించింది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. టైటిల్ పాత్రలో నటించిన ధనుశ్.. పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఓ వైపు సమస్యను ఎదుర్కొనే యువకుడిగా, మరో వైపు భావోద్వేగాలు కలగలిసిన వ్యక్తిగా ఓ పరిణితిగల పాత్రలో మెప్పించబోతున్నారనే విషయం స్పష్టమవుతోంది. తనదైన స్టైల్లో ధనుష్ పాత్రలో ఒదిగిపోయారనేది టీజర్‌లో తెలుస్తోంది.
డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీస్‌తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి థేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నటీనటులు : ధనుష్, మమిత బైజు, కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి & ఇతరులు.
సాంకేతిక బృందం
- బ్యానర్ : విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ – ఆర్ స్టార్ లాజిస్టిక్స్
- రచన : విఘ్నేశ్ రాజా, ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్
- దర్శకుడు : విఘ్నేశ్ రాజా
- సంగీతం : జీవీ ప్రకాష్
- డీఓపీ : థేనీ ఈశ్వర్
- ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
- కార తెలుగు రిలీజ్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్
- పీఆర్వో (తెలుగు): బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి)
- డిజిటల్ మార్కెటింగ్ (తెలుగు) : విష్ణు తేజ్ పుట్టా
- ఈవెంట్ పార్టనర్ (తెలుగు) : యు వి మీడియా
ధనుష్ కర సినిమా తెలుగు టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి