Mangli: ₹200Cr భారీ స్కామ్‌.. మంగ్లీ క్లారిఫికేషన్..

Mangli: ₹200Cr భారీ స్కామ్‌.. మంగ్లీ క్లారిఫికేషన్..


రాష్ట్రంలో కలకలం రేపుతున్న శుభాక్షేత్ర ఇన్ఫ్రా, మైక్రో ఫైనాన్స్ ఆర్థిక మోసాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సామాన్యుల కష్టార్జితాన్ని రెట్టింపు చేస్తామంటూ నమ్మించి కోట్ల రూపాయల మేర జరిగిన ఈ వసూళ్ల పర్వంలో ప్రముఖ గాయని మంగ్లీ పేరు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవైపు తనపై వస్తున్న ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఆమె ప్రమేయంపై గిరిజన విద్యార్థి సంఘాల నేతలు ఆధారాలతో సహా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేరుతో జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు గాయని మంగ్లీ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని దుష్ప్రచారంగా కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో బాధితులకు అన్యాయం జరిగిందని చెబుతూ… వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మోసం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన మంగ్లీ… కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజం తప్పకుండా బయటపడుతుందని, తాను చట్టాన్ని, న్యాయవ్యవస్థను సంపూర్ణంగా గౌరవిస్తానని తెలిపారు. ఇక, న్యాయ ప్రక్రియపై పూర్తి నమ్మకం ఉందని చెబుతూ… చట్టపరమైన మార్గంలోనే అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆమె చెప్పారు. మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో నడిచిన ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, భూములపై పెట్టుబడులు పెడితే త్వరగా రిటర్న్స్ వస్తాయని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, గ్రామీణ పెట్టుబడిదారులు లక్ష్యంగా చేసుకుని ఈ స్కీమ్ నడిపినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా లాభాలు, కొంత కాలానికి డబుల్ అవుతుందనే హామీలతో డబ్బులు సేకరించినట్టు సమాచారం. కొందరికి ప్రారంభంలో చిన్న మొత్తాలు తిరిగి ఇచ్చి నమ్మకం కల్పించి… తర్వాత పెద్ద మొత్తాలు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సంస్థ కార్యకలాపాలు మందగించడం, చెల్లింపులు ఆగిపోవడం వల్ల అనుమానాలు మొదలయ్యాయి. బాధితుల ప్రకారం, కోట్ల రూపాయల వరకు డబ్బులు ఈ వ్యవహారంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పలువురు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. ఈ కేసులో కొందరిపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యి విచారణ కొనసాగుతోంది. ఈ వివాదంలో ప్రముఖ గాయని మంగ్లీ పేరు బయటకు రావడంతో చర్చ మరింత వేడెక్కింది. అయితే ఈ ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ… ఈ మోసంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన పేరును ఈ కేసులోకి లాగుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ మోసాలపై రాష్ట్ర గిరిజన సంఘ విద్యార్థి నేత సంపత్ నాయక్ తీవ్రంగా స్పందించారు. అధిక వడ్డీ ఆశచూపి కోట్లు వసూలు చేసిన వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. మధుకి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, ఈ కేసులో బాధితులు తనను ఆశ్రయించారని తెలిపారు. మధుకి డబ్బులు చెల్లించి మోసపోయిన కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారని వివరించారు. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ.. తనకు మధు ఎవరో తెలియదని చెప్పడం విడ్డూరం అని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా ఈ నెల 15న మంగ్లీ స్వయంగా తనకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వమని కోరినట్లు సంపత్ నాయక్ వెల్లడించారు. తర్వాత ఈ కేసులో బాధితుల వెర్షన్‌ విని, అసలు నిజాలు బయటకు రావాలని మీడియా ముందుకు వచ్చానన్నారు. నిజంగా మంగ్లీకి మధు ఎవరో తెలియపోతే తన ఇంటికి ఎలా వచ్చాడని, అందరూ కలిసి ఎలా ఫోటోలు దిగారని ఆయన ప్రశ్నించారు. మంగ్లీ ఆడియో కాల్‌ను మీడియాకు వినిపించిన సంపత్‌ నాయక్.. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు. అంతేకాకుండా బెంగళూరు సమీపంలోని కోట్ల విలువైన ఆరు ఎకరాల భూమి ఎవరిదో చెప్పాలని సంపత్ నాయక్ నిలదీశారు. ఫార్చునర్, డిఫెండర్ కారులో మధు, మంగ్లీ సోదరుడు, హిమాకాంత్ రెడ్డి వచ్చి.. బెంగళూరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఆరు ఎకరాల భూమి గురించి వారు మాట్లాడినట్టు చెప్పారు. కర్ణాటక మాజీ మంత్రి మనవడి నుంచి అందిన ₹80 లక్షల వ్యవహారంలో మంగ్లీ తమ్ముడి పాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలు డీజీపీకి అందజేస్తానని స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, రియల్ ఎస్టేట్ రిటర్న్స్ పేరుతో మధ్యతరగతి, గ్రామీణ ప్రజలను ఈ సంస్థ ఆకర్షించింది. ప్రారంభంలో కొందరికి లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించి, ఆపై పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బు కోల్పోయిన కొందరు మనస్తాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల విచారణలో ఉంది. ప్రముఖ సెలబ్రిటీ మంగ్లీ పేరు బయటకు రావడంతో బాధితులు తమకు న్యాయం జరుగుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు. పోలీసుల తదుపరి విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: వచ్చే నాలుగు రోజులు ఎండలే ఎండలు

TSRTC: మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. చర్చలు షురూ.. ఆ మూడు డిమాండ్లే కీలకం

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధరలు

తేమతో కూడిన ఉక్కపోత.. ఎందుకు ప్రమాదకరం ??

ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *