Headlines

Gas Cylinder Rules: ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? ఆగస్ట్ 1 నుంచి కొత్త మార్పులు.. ఈ నిబంధనలు రానున్నాయ్..

Gas Cylinder Rules: ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా..? ఆగస్ట్ 1 నుంచి కొత్త మార్పులు.. ఈ నిబంధనలు రానున్నాయ్..


దేశంలోని ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగిస్తూ ఉంటారు. దీంతో వీటికి సంబంధించి ఏదైనా చిన్న మార్పు జరిగినా కోట్లాదిమంది దేశ ప్రజలను ప్రభావితం చూపిస్తుంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతుండటం, హర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడిన క్రమంలో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో దేశంలో గ్యాస్ కొరత మళ్లీ ఏర్పడే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర పలుమార్లు గ్యాస్ ధరలను పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచితే సామాన్యులపై మరింత భారం పడనుంది. అయితే ఆగస్ట్ 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి మార్పులు రానున్నాయనేది చూద్దాం.

గ్యాస్ ధరలు పెరుగుతాయా..?

ప్రతీ నెలా ఒకటో తేదీన కొత్త గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఆగస్ట్ 1న కొత్త ధరలను ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ వెల్లడించనున్నాయి. గ్యాస్ ధరలను పెంచడం, తగ్గించడం లేదా యథాతధంగా ఉంచడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ఈ సారి గ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. జులైలో ఇప్పటివరకు 40 శాతం మేర పెరిగాయి. సౌదీ అరేబియా నుంచి ముడి చమురు ఎక్కువ ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇప్పుడు గల్ప్ దేశాల్లో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో గ్యాస్ రవాణాకు అంతరాయం కలుగుతోంది. జులైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించిన కేంద్రం.. డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

సబ్సిడీలో కొత విధింపు

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.300 సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఏడాదికి 6 సిలిండర్లపై సబ్సిడీ అందించేవారు. ఆ లిమిట్ దాటి బుక్ చేసుకునే సిలిండర్లపై సబ్సిడీ అందించేవారు కాదు. ఇప్పుడు ఆ పరిమితిని నాలుగు సిలిండర్లకు తగ్గించారు. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ సొమ్ము అందుతుంది. ఆ పరిమితి దాటితే సబ్సిడీ వర్తించదు. ఆగస్టులో కూడా ఈ రూల్ కొనసాగనుంది.

పీఎన్‌జీ నిబంధన

ఇక పీఎన్‌జీ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు ఎల్పీజీ నుంచి పీఎన్‌జీలోకి మారాలని కేంద్రం నిబంధన విధించింది. ఈ నిబంధన ఆగస్టులో కూడా కొనసాగనుంది. ఒక కుటుంబం ఒక కనెక్షన్ అనే నియమం తీసుకొచ్చింది. ఎల్పీజీ, పీఎన్‌జీలలో ఏదొ ఒక కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలి. రెండు కనెక్షన్లను కలిగి ఉండకూడదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *