Headlines

LIC: ఎవరూ క్లెయిమ్ చేయని ఎల్ఐసీ సొమ్ము ఏమవుతుంది..? 10 ఏళ్ల తర్వాత అయినా తీసుకోవచ్చా..?

LIC: ఎవరూ క్లెయిమ్ చేయని ఎల్ఐసీ సొమ్ము ఏమవుతుంది..? 10 ఏళ్ల తర్వాత అయినా తీసుకోవచ్చా..?


కుటుంబం కోసం చాలామంది ఇప్పట్లో లైఫ్, టర్మ్ ఇన్యూరెన్స్ లాంటి పాలసీలు తీసుకుంటున్నారు. అనుకోని ఘటనల్లో కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు కుటుంబ ఆర్ధిక అవసరాలను ఇవి తీర్చుతాయి. ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్ కింద ఇవి ఉపయోగపడతాయి. వ్యాపారులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఇటీవల పాలసీలను తీసుకుంటున్నారు. మార్కెట్లో అనేక బీమా కంపెనీలు కొత్తగా పుట్టుకురావడంతో పాటు అనేక కొత్త పాలసీలను ప్రారంభిస్తున్నాయి. రకరకాల ప్రయోజనాలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పాలసీలకు ఒక కాలపరిమితి ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ పరిమితి ముగిశాఖ పాలసీలు మెచ్యూర్ పూర్తవుతాయి. అనంతరం వడ్డీతో సహా మొత్తం సొమ్మును తీసుకోవచ్చు.

అయితే మెచ్యూర్ పూర్తయిన తర్వాత నగదు విత్ డ్రా చేసుకునేందుకు క్లెయిమ్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే క్లెయిమ్ చేయకపోతే ఏమవుతుంది అనే అనుమానం చాలా ఉంటుంది. 10 సంవత్సరాల వరకు ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆ నిధులు వయోవృద్దుల సంక్షేమ నిధికి వెళతాయి. వీటిని వయోవృద్ధుల ప్రయోజనం కోసం ఉపయోగించబడతాయి. మీరు ఎల్ఐసీ కస్టమర్ అయితే క్లెయిమ్ చేయని సొమ్మును చెక్ చేసి విత్ డ్రా చేసుకోవచ్చు. పాలసీ నెంబర్, పాలసీదారుడి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ ద్వారా గుర్తించవచ్చు. అనంతరం సమీపంలోని బ్రాంచును సంప్రదించి నగదును క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. సరెండర్ ఫారం, రిక్వెస్ట్ లెటర్, కేవైసీ డాక్యుమెంట్స్, నెఫ్ట్ డీటైల్స్, ఒరిజినల్ పాలసీ బాండ్ అవసరం. ఈ డాక్యుమెంట్లతో ఎల్ఐసీ సమీప శాఖను సంప్రదించాలి. లేదా ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇటీవల ఎవరూ క్లెయిమ్ చేయని ఎల్ఐసీ అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎల్‌ఐసీలో రూ.7,318.50 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ నిధులు ఉన్నట్లు కేంద్రం వివరించింది. రూ.5,564.55 కోట్లు పాలసీదారుల అసలు కాగా.. రూ.1,753.95 కోట్లు వాటిపై వచ్చే వడ్డీ సొమ్ము అని తెలిపింది. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయకపోతే ఈ నిధులు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌‌కు వెళతాయని, వీటిని వేరే అవసరాల కోసం ఉపయోగించమని స్పష్టం చేసింది. ఈ సొమ్మును నామినీలకు అందించేలా ఎల్ఐసీ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అంతేకానీ వీటిని వేరే అవసరాల కోసం వినియోగించుకునే ఉద్దేశం తమకు లేదని తెలిపింది. ప్రత్యేక క్యాంపులు, లోకల్ ఏజెంట్ల ద్వారా నామినీలకు గుర్తించి వారికి అందించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *