Headlines

Cinema: మొన్న కామాఖ్య.. నేడు చైనా పీస్.. పేరు మార్చుకున్న మరో తెలుగు సినిమా.. రిలీజ్‌కి రెడీ

Cinema: మొన్న కామాఖ్య.. నేడు చైనా పీస్.. పేరు మార్చుకున్న మరో తెలుగు సినిమా.. రిలీజ్‌కి రెడీ


నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇంతకుముందు ‘చైనా పీస్’ పేరుతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిత్రం, ఇప్పుడు ‘సీక్రెట్ సోల్జర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) యూ/ఏ 16+ సర్టిఫికెట్ జారీ చేసింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేశారు. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు

టెక్నికల్ టీం:

రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి

బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు

సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్

పీఆర్వో: తేజస్వీ సజ్జా

చైనా పీస్ సినిమా టీజర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *