హీరో సూర్య తన అభిమానులకు ఫుల్ మీల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. 2026 సంవత్సరం పూర్తిగా తన పేరు మీదే రాసుకునేలా ఆయన ప్రణాళికలు వేస్తున్నారు. ఒకప్పుడు సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకున్న సూర్య, ఇప్పుడు ఏడాదికి మూడు లేదా నాలుగు చిత్రాలతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కరుప్పు సినిమాతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న సూర్య, ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లకు పైగా వసూళ్లను సాధించి తన సత్తా చాటారు. ఈ విజయం తర్వాత సూర్య జోరు మరింత పెరిగింది. సాధారణంగా బ్లాక్బస్టర్ విజయం తర్వాత హీరోలు గ్యాప్ తీసుకుంటారు కానీ సూర్య మాత్రం స్పీడ్ పెంచుతున్నారు. ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీతు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూర్య 47వ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ చిత్రం దీపావళికి లేదా డిసెంబర్లో విడుదల కానుంది. అంటే ఆరు నెలల వ్యవధిలో మూడు చిత్రాలు అన్నమాట. దీనికి తోడు, సూర్య 48వ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2027 మొదటి భాగంలో థియేటర్లలోకి రానుంది. మొత్తంగా, ఒక ఏడాది వ్యవధిలో సూర్య నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :