జీర్ణక్రియ వేగవంతం – గ్యాస్ సమస్యల నుంచి విముక్తి: ఇంగువలోని ప్రధాన సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపిస్తాయి. పరగడుపున ఇంగువ నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తక్షణమే తగ్గుతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడేవారికి ఇది అద్భుతమైన సహజ మందు.
బరువు తగ్గడానికి సహకారం: శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో ఇంగువ నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించి, వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డ్రింక్‌గా ఉపయోగపడుతుంది.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం: ఇంగువలో శ్లేష్మాన్ని కరిగించే, వాపును తగ్గించే గుణాలు ఉన్నాయి. నిత్యం పరగడుపున దీనిని తీసుకోవడం వల్ల ఉబ్బసం, బ్రోంకైటిస్, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: మధుమేహం ఉన్నవారికి ఇంగువ నీరు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
ఉదర నొప్పులు, పీరియడ్స్ నొప్పి ఉపశమనం: హిళల్లో రుతుక్రమం సమయంలో వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిర్ల నుండి ఉపశమనం పొందేందుకు ఇంగువ నీరు ఒక మంచి ఔషధం. ఇది కడుపు కండరాలను సడలించి ప్రశాంతతను ఇస్తుంది. ఇంగువలో ఉండే కౌమరిన్ అనే సమ్మేళనం రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది.రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.




