CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. శనివారం నాటి పోటీల్లో బాక్సర్లు ఊహించని రీతిలో ఏకంగా 10 పతకాలు అందించడంతో భారత్ పతకాల పట్టికలో ఏకంగా 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 వెండి, 9 కాంస్య పతకాలతో మొత్తం 39 పతకాలు చేరాయి. కుస్తీ (రెజ్లింగ్), బ్యాడ్మింటన్, హాకీ వంటి మనకు బలమైన క్రీడాంశాలు ఈసారి కామన్వెల్త్‌లో లేకపోయినప్పటికీ.. మన అథ్లెట్లు మిగిలిన క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. పారా పవర్ లిఫ్టింగ్‌లో ఝండు కుమార్ కాంస్య పతకం సాధించి భారత్ మెడల్ బోణీ కొట్టగా, వెయిట్‌లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించడం విశేషం.
అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర
ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో భారత్ అనేక కొత్త రికార్డులను నెలకొల్పింది. మెన్స్ డెకాథ్లాన్ ఈవెంట్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించి, కామన్వెల్త్ చరిత్రలోనే డెకాథ్లాన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. మరోవైపు సుదీర్ఘ పరుగుల అథ్లెట్ గుల్వీర్ సింగ్ ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కాడు. గుల్వీర్ మెన్స్ 10,000 మీటర్లలో వెండి పతకం, 5,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించాడు. జూడో, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్లు ఇంకా మిగిలి ఉండటంతో భారత్ 40 పతకాల మార్కును దాటడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
CWG 2026: భారత విజేతల పూర్తి జాబితా
బంగారు పతక విజేతలు (13 గోల్డ్):
1. సాయిఖోమ్ మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్ – విమెన్స్ 48 కేజీలు)
2. షర్మిల ధంకడ్ (పారా అథ్లెటిక్స్ – విమెన్స్ షాట్ పుట్ F57)
3. దిలీప్ గావిట్ (పారా అథ్లెటిక్స్ – మెన్స్ 100 మీటర్లు T47)
4. అస్మిత దే (జూడో – విమెన్స్ 48 కేజీలు)
5. హర్ష్ సింగ్ (జూడో – మెన్స్ 60 కేజీలు)
6. సోమన్ రాణా (పారా అథ్లెటిక్స్ – మెన్స్ షాట్ పుట్ F57)
7. ప్రీతి పవార్ (బాక్సింగ్)
8. జాస్మిన్ లాంబోరియా (బాక్సింగ్)
9. సాక్షి చౌదరి (బాక్సింగ్)
10. ప్రియా ఘంఘాస్ (బాక్సింగ్)
11. అరుంధతి చౌదరి (బాక్సింగ్)
12. సచిన్ సివాచ్ (బాక్సింగ్)
13. అంకుష్ పంఘాల్ (బాక్సింగ్)
వెండి పతక విజేతలు (17 సిల్వర్):
1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్ – మెన్స్ జావెల్రిన్ త్రో – 85.83m)
2. మురళి శ్రీశంకర్ (అథ్లెటిక్స్ – మెన్స్ లాంగ్ జంప్)
3. ప్రవీణ్ చిత్రవేల్ (అథ్లెటిక్స్ – మెన్స్ ట్రిపుల్ జంప్ – 16.58m)
4. సర్వేష్ అనిల్ కుషారే (అథ్లెటిక్స్ – మెన్స్ హైజంప్)
5. గుల్వీర్ సింగ్ (అథ్లెటిక్స్ – మెన్స్ 10,000m)
6. రిషికాంత సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్ – మెన్స్ 60 కేజీలు)
7. ముత్తుపాండి రాజా (వెయిట్‌లిఫ్టింగ్ – మెన్స్ 65 కేజీలు)
8. జ్ఞానేశ్వరి యాదవ్ (వెయిట్‌లిఫ్టింగ్ – విమెన్స్ 53 కేజీలు)
9. వల్లూరి అజయ్ బాబు (వెయిట్‌లిఫ్టింగ్ – మెన్స్ 79 కేజీలు)
10. హర్జిందర్ కౌర్ (వెయిట్‌లిఫ్టింగ్ – విమెన్స్ 69 కేజీలు)
11. లవ్‌ప్రీత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్ – మెన్స్ +110 కేజీలు)
12. లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్ – విమెన్స్ 75 కేజీలు)
13. నరేందర్ బెర్వాల్ (బాక్సింగ్ – మెన్స్ 90+ కేజీలు)
14. జదుమణి సింగ్ (బాక్సింగ్ – మెన్స్ 55 కేజీలు)
15. యామిని మౌర్య (జూడో – విమెన్స్ 57 కేజీలు)
16. మహమ్మద్ బాసిల్ (పారా అథ్లెటిక్స్ – మెన్స్ 100m T47)
17. శుభమ్ జుయాల్ (పారా అథ్లెటిక్స్ – మెన్స్ షాట్ పుట్ F57)
కాంస్య పతక విజేతలు (9 బ్రాంజ్):
1. యశ్ వీర్ సింగ్ (అథ్లెటిక్స్ – మెన్స్ జావెల్రిన్ త్రో – 85.41m)
2. సెల్వ ప్రభు తిరుమారన్ (అథ్లెటిక్స్ – మెన్స్ ట్రిపుల్ జంప్ – 16.52m)
3. గుల్వీర్ సింగ్ (అథ్లెటిక్స్ – మెన్స్ 5000m)
4. తేజస్విన్ శంకర్ (అథ్లెటిక్స్ – మెన్స్ డెకాథ్లాన్)
5. సీమా కలిరామ్నా (అథ్లెటిక్స్ – విమెన్స్ డిస్కస్ త్రో – 58.65m)
6. బింధ్యారాణి దేవి (వెయిట్‌లిఫ్టింగ్ – విమెన్స్ 58 కేజీలు)
7. ఝండు కుమార్ (పారా పవర్ లిఫ్టింగ్ – మెన్స్ హెవీవెయిట్)
8. శిల్పా షైలా (పారా అథ్లెటిక్స్ – విమెన్స్ షాట్ పుట్ F57)
9. ఉన్నతి శర్మ (జూడో)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.