Headlines

Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఏం రాత రాశావయ్యా.. మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..

మరికొన్ని గంటల్లో పెళ్లి.. భాజాభజంత్రీలు మోగాల్సిన వేళ.. బంధుమిత్రుల రాకతో ఆ ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో నూరేళ్ల బంధంలోకి అడుగుపెట్టాల్సిన పెళ్లికొడుకు సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. కానీ ఆ సరదాయే ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కొత్తగా విడుదలైన కృష్ణా జలాల పరవళ్లను చూసేందుకు వెళ్లి, ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన వరుడితో పాటు మరో బంధువు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల…

Read Full News

EPFO: 40 ఏళ్ల వయస్సులో ఉద్యోగం మానేస్తే వడ్డీ ఆగిపోతుందా..? చాలామందికి తెలియని పీఎఫ్ నిబంధనలు..

చాలామంది రిటైర్మెంట్ వయస్సు వరకు ఉద్యోగం చేయరు. మధ్యలోనే వివిధ కారణాలతో ఉద్యోగం మానేస్తూ ఉంటారు. భారత్‌లో రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 ఏళ్లుగా ఉండగా.. వివిధ సెక్టార్లు ,రాష్ట్రాలు, పనిచేసే ఉద్యోగాన్ని బట్టి రిటైర్మెంట్ వయస్సులో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది 40 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగం మానేస్తుంటారు. అలాంటివారు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉంటే వారి బ్యాలెన్స్‌పై వడ్డీ కొనసాగుతుందా? అనే ప్రశ్నలు…

Read Full News

హాట్ టాపిక్‌గా హీరోయిన్ల సోషల్ మీడియా స్ట్రాటజీ

సినిమాలు వరుసగా చేయడం ద్వారా స్టార్‌డమ్ లభిస్తుందా, లేక అభిమానులతో నిరంతరం సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వడం అసలైన రహస్యమా అనేది ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజుల్లో, హీరోయిన్లకు కేవలం సినీ అవకాశాలతోనే కాకుండా, వారి సోషల్ మీడియా ప్రజెన్స్‌తోనే ఎక్కువ గుర్తింపు, వెయిటేజ్ లభిస్తోంది. కొంతమంది నటీమణులు కొత్త సినిమా అప్‌డేట్స్ లేకపోయినా, సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా కనిపిస్తూ ట్రెండ్‌లో ఉంటున్నారు. దీనికి విరుద్ధంగా, మరికొంతమంది క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నప్పటికీ,…

Read Full News

Mohammed Shami: టీమిండియాలోకి మహమ్మద్ షమీ రీఎంట్రీ?.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌పైనే సెలెక్టర్ల కన్ను

Mohammed Shami: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డే జట్టులోకి రీఎంట్రీకి సర్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేసే క్రమంలో సెలెక్టర్లు షమీ పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్) ప్రారంభం కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే భారత టీ20 జట్టులో ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్,…

Read Full News

Duleep Trophy Final: వైభవా నువ్వింక మారవా..? ఫైనల్ అనే భయం కూడా లేకుండా..

దేశవాళీ క్రికెట్‌లో ఎంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ ఆదివారం ప్రారంభమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్ వర్సెస్ సౌత్ జోన్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించి మంచి ఆరంభాన్ని అందించారు. వైభవ్ అగ్రెసివ్ బ్యాటింగ్ ఎప్పటిలాగే వైభవ్ సూర్యవంశీ తనకు అలవాటైన…

Read Full News

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026.. హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ సంచలన విజయం

హైదరాబాద్ కుర్రాడు విశేష్ శర్మ చరిత్ర సృష్టించాడు. సొంత గడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌లో 19 ఏళ్ల విశేష్ తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కోర్సులో హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో విశేష్ అసాధారణ ఆటతీరు కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు. తన హోం కోర్స్‌లో అది కూడా 19 ఏళ్ల వయసులోనే తొలి ప్రొఫెషనల్ టైటిల్ గెలవడం మర్చిపోలేని…

Read Full News

జిడ్డు పట్టిన టీ జాలిని కొత్తదానిలా మెరిపించే చిట్కాలు.. నల్లటి మరకలు చిటికెలో మాయం!

రోజూ టీ వడపోసే జాలి పైన పేరుకుపోయే టీ పొడి మరకలు, నలుపును వదిలించడం సాధారణ సోప్‌తో కష్టం. అయితే కొన్ని సులభమైన గృహ చిట్కాలతో టీ జాలిని కొత్తదానిలా మెరిపించవచ్చు. ఈ చిట్కాలు పాటించడం వల్ల జాలి శుభ్రపడటమే కాకుండా బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. టీ జాలిని సులభంగా శుభ్రం చేసే పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం.. 1. స్టవ్ మంటపై కాల్చే పద్ధతి (స్టీల్ జాలి కోసం మాత్రమే): మీ దగ్గర ఉన్నది స్టీల్ టీ…

Read Full News

హైదరాబాద్‌ DRDOలో రీసెర్చ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షల్లో జీతం

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI).. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌లో భాగమైన RCIలో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) తాత్కాలిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది…..

Read Full News

Match Fixing: పాకిస్థాన్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ప్లేయర్ల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పీసీబీ

Match Fixing: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు ఏడుగురు ఆటగాళ్లను, కోచ్‌ను జట్టు నుంచి తొలగించిన పీసీబీ ఇప్పుడు ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలకు తావిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకుంటున్న వింత నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇంగ్లాండ్‌తో కీలకమైన ఆఖరి టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జాతీయ…

Read Full News

Gold Rates: ఏకంగా రూ.3 వేలకుపైగా తగ్గిన బంగారం.. కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్..

గత వారంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతకముందు వారం కూడా పడిపోగా.. గత వారం కూడా మరోసారి డౌన్ అయ్యాయి. దీంతో గోల్డ్ ప్రియులకు గత రెండు వారాలుగా ధరలు ఊరట కల్పిస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు గత వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వారం ప్రారంభంలో పతనమవ్వగా.. మధ్యలో కాస్త పుంజుకున్నాయి. వారం చివరినాటికి మళ్లీ…

Read Full News