Headlines

Duleep Trophy Final: వైభవా నువ్వింక మారవా..? ఫైనల్ అనే భయం కూడా లేకుండా..


దేశవాళీ క్రికెట్‌లో ఎంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ ఆదివారం ప్రారంభమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్ వర్సెస్ సౌత్ జోన్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించి మంచి ఆరంభాన్ని అందించారు.

వైభవ్ అగ్రెసివ్ బ్యాటింగ్

ఎప్పటిలాగే వైభవ్ సూర్యవంశీ తనకు అలవాటైన నాటు కొట్టుడుతోనే మొదలుపెట్టాడు. 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేసి మిలింద్ బౌలింగ్‌లో త్యాగరాజన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అద్బుతంగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుట్ అవ్వడంతో వైభవ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. అంత బాగా ఆడుతున్నావ్.. కాస్త ఓపికతో ఆడొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ అనే భయం కూడా లేకుండా ఏంటా అగ్రెసివ్ బ్యాటింగ్, టెస్టుల్లోనూ టీ20 స్టైల్ మార్చవా అంటూ మండిపడుతున్నారు. అయితే ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో వైభవ్ చెలరేగిపోయాడు. సిరాజ్ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.

సిరాజ్ ఎంట్రీ..

అయితే ఆరంభంలో‌ టీమ్‌కు వేగంగా రన్స్ అందించిన తర్వాత వైభవ్ అవుట్ అయ్యాడు. అప్పటికీ ఈస్ట్ జోన్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 72 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో శిఖర్ మోహన్, సుదీప్ కుమార్ ఉన్నారు. మరో ఎండ్‌లో మన సౌత్ జోన్ నుంచి మొహమ్మద్ సిరాజ్, నిధీష్, త్రిపురణ విజయ్, మిలింద్, శ్రేయస్ గోపాల్ బౌలింగ్ సంధిస్తున్నారు. మిలింద్‌ ఇప్పటికే ఒక వికెట్ సాధించాడు. ప్రస్తుతం ఈస్ట్ జోన్ 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *