Headlines

Chiyaan Vikram: ఆమె చాలా అందమైన హీరోయిన్.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలనిపించేది.. హీరో విక్రమ్..


నటుడు చియాన్ విక్రమ్ తన కెరీర్‌లోని పలు ఆసక్తికర విషయాలను, సహనటుల గురించిన అభిప్రాయాలను ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విక్రమ్‌ను ఆయన నటించిన హీరోయిన్లలో ఐదుగురిని ర్యాంక్ చేయమని అడిగినప్పుడు, ఆయన దివంగత నటి సౌందర్యను మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్గా పేర్కొన్నారు. “నేను పనిచేసిన అత్యంత అందమైన నటి సౌందర్య. నేను ఎప్పుడూ అలానే భావిస్తున్నాను. ఆమె నిజంగా చాలా అందమైనది,” అని విక్రమ్ అన్నారు. సౌందర్య మరణం పరిశ్రమకు, తన వంటి స్నేహితులకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను సినీరంగంలో కొత్తగా ఉన్నప్పుడు, సౌందర్య పెద్ద స్టార్‌ అయినప్పటికీ, చాలా సాధారణంగా వచ్చి మాట్లాడేవారని, ఆమె చాలా మంచి వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. “ఆమె ఎంత అందంగా అంటే, ఒక దేవతలా ఉండేది. నువ్వు ఇంటికి తీసుకెళ్ళి, ఈమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలనిపించేంత అందమైన, అమాయకమైన, మధురమైన వ్యక్తి,” అంటూ సౌందర్యను విక్రమ్ చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

తర్వాత స్థానంలో శ్రేయను పేర్కొంటూ, “ప్రస్తుత హీరోయిన్లలో ఆమెదే కదా,” అని అన్నారు.. జ్యోతిక గురించి మాట్లాడుతూ, ఆమెలో ఒక మిస్చివియస్ (అల్లరి) స్వభావం ఉందని, పాటల్లో చాలా అందంగా కనిపిస్తుందని, కానీ మరోలా చాలా అల్లరిగా ఉంటుందని, ఆమెకు చాలా మంచి లుక్స్, వొలటైల్ ఫేస్ ఉందని వివరించారు. త్రిష గురించి మాట్లాడుతూ, ఆమె ఎన్ని సినిమాలు చేసినా ఆ యువతరం ఛార్మ్ కోల్పోలేదని, చాలా అమాయకమైన, నైవ్ బ్యూటీ అని పేర్కొన్నారు. రీమా సేన్ గురించి మాట్లాడుతూ, ఆమె చాలా ప్రొవోకేటివ్‌గా, అదే సమయంలో చాలా బలంగా, డామినేటింగ్ వుమన్‌గా ఉంటుందని విక్రమ్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఒకే సినిమాను రెండు భాషల్లో, రెండు విభిన్నమైన పాత్రలతో చేయడం గొప్ప సవాలు అని విక్రమ్ పేర్కొన్నారు. “ఇది అద్భుతమైన ఛాలెంజ్. రెండు లాంగ్వేజ్‌లలో చేసేటప్పుడు, ఇది ఒక ప్రత్యేక అనుభవం,” అని అన్నారు. మల్లన్న లేదా కందసామి వంటి చిత్రాలలో తాను రెండు భాషల్లో ఒకే పాత్రను పోషించానని, కానీ రావణ్ విషయంలో ఇది భిన్నమని వివరించారు. హిందీ వెర్షన్‌లో తాను పృథ్వీరాజ్ పోషించిన రగ్గడ్, గ్రఫ్ఫీ, డర్టీ, బుల్లిష్ పాత్రను పోషిస్తుండగా, తమిళ వెర్షన్‌లో అభిషేక్ బచ్చన్ ఒక క్రిస్ప్ పోలీస్ ఆఫీసర్, అథారిటేటివ్, క్లీన్ లుక్ ఉన్న పాత్రను పోషించారు. తన రూపురేఖలు దాదాపు ఒకేలా ఉన్నా, కేవలం రెండు రోజుల షూటింగ్ మధ్య తన పాత్ర మారిందని, ఇది నటుడిగా చాలా ప్రత్యేకమైనదని విక్రమ్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

విక్రమ్ సౌందర్య..

Vikram, Soundarya

Vikram, Soundarya

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *