Headlines

Car Rats: ఎలుకలు కారు ఇంజిన్‌లోకి దూరడానికి ఎందుకు ఇష్టపడతాయి? భారీ నష్టం జరగకుండా ఇలా చేయండి!


Car Rats: ఒక కారును చాలా రోజుల పాటు ఒకే చోట నిలిపి ఉంచితే, ఎలుకలు ఇంజిన్‌ను తమ నివాసంగా చేసుకుంటాయి. ముఖ్యంగా కారును బహిరంగ పార్కింగ్ స్థలంలో చెత్త లేదా మిగిలిపోయిన ఆహారం ఉన్న ప్రదేశంలో నిలిపి ఉంచినట్లయితే ఎలుకలు సులభంగా కారులోకి ప్రవేశిస్తాయి. ఇంజిన్‌లోని వెచ్చదనం ఎలుకలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. కారులో మకాం వేసిన ఈ ఎలుకలు, తమ పళ్ల పెరుగుదలను నియంత్రించుకోవడానికి నిరంతరం ఏదో ఒకదానిని కొరుకుతూ ఉంటాయి. ఈ క్రమంలో అవి కారు వైర్లు, ప్లాస్టిక్ కవర్లు, రబ్బరు పైపులను పాడు చేస్తాయి.

ఒక చిన్న తీగను కొరికితే పెద్ద నష్టం జరగదని అనుకోవద్దు. నష్టం తీవ్రత అది జరిగిన తీరుపై ఆధారపడి ఉంటుంది. ఎలుకలు విద్యుత్ తీగలను కొరికితే, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యమైన సెన్సార్ల తీగలు తెగిపోతే, డాష్‌బోర్డ్‌పై హెచ్చరిక లైట్లు వెలుగుతాయి. రబ్బరు పైపు దెబ్బతింటే, కారు నుండి ఆయిల్స్‌ లీక్ కావచ్చు. మొత్తం వైరింగ్ హార్నెస్ దెబ్బతింటే, లక్షల రూపాయల నష్టం జరగవచ్చు. ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు పనిచేయడం ఆగిపోతాయి.

కారును ఎలుకలు కొరకడానికి ఎంత ఖర్చు అవుతుంది?

ఒక్క వైరు పాడైతేనే వందల రూపాయలు ఖర్చవుతుంది. కానీ వైరింగ్ హార్నెస్, సెన్సార్లు పాడైతే ఖర్చు చాలా పెరుగుతుంది. ఆధునిక కార్లలో అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉంటాయి. ఎక్కడైనా ఒక వైరును ఎలుక కొరికినా కూడా కారులోని ముఖ్యమైన వ్యవస్థలు పనిచేయవు. కొన్నిసార్లు మొత్తం వైరింగ్‌ను మార్చాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలలో ఖర్చు వేల లేదా లక్షల రూపాయల వరకు వెళ్ళవచ్చు. ఈ ఖర్చు కారు మోడల్‌ను బట్టి మారుతూ ఉంటుంది.

కారులో ఎలుకలు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఎలుకలు కారు వైర్లను కొరికే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు కనిపిస్తే, మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు. మీరు బోనెట్ తెరిచినప్పుడు ఎలుకల రెట్టలు కనిపిస్తే, కారులో ఎలుకలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంజిన్ దగ్గరకు కాగితం లేదా గుడ్డను తీసుకువచ్చినట్లు కనిపిస్తే మీరు అనుమానించాలి. వైర్ కవర్లు చిరిగిపోయి ఉండటం డాష్‌బోర్డ్‌పై హెచ్చరిక లైట్లు కారణం లేకుండా వెలగడం, లేదా ఏసీ సరిగ్గా పనిచేయకపోవడం వంటివి కనిపిస్తే, ఎలుకలు కారులోకి ప్రవేశించాయని మీరు భావించాలి.

ఇది కూడా చదవండి: Hotel Rooms: హోటళ్లు తాళాలకు బదులుగా ఎలక్ట్రానిక్ కార్డులను ఎందుకు ఇస్తాయో తెలుసా?

మీ కారును ఎలుకల నుండి రక్షించుకోవడానికి 8 మార్గాలు

1. మీ కారును ఎల్లప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో పార్క్ చేయండి. చెత్త లేదా ఆహార వ్యర్థాలు ఉన్న ప్రదేశంలో పార్క్ చేయవద్దు.

2. కారు లోపల ఎలాంటి ఆహార పదార్థాలను ఉంచవద్దు. వాటి వాసన ఎలుకలను ఆకర్షిస్తుంది.

3. కారు బోనెట్‌ను తెరిచి, దానిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

4. మీరు ఎలుకల నివారణ స్ప్రేను ఉపయోగించవచ్చు. కానీ దానిని ఇంజిన్ లేదా బ్యాటరీ దగ్గర స్ప్రే చేయవద్దు.

5. ఎలుకలు కారు వైర్లను కొరకకుండా నివారించడానికి వాటికి ప్రత్యేక టేప్ అంటించండి.

6. ఎలుకలు కారు ఇంజిన్‌లోకి ప్రవేశించగల మార్గాలలో మీరు మెష్‌ను అమర్చవచ్చు.

7. మీ కారును ఉపయోగించకుండా చాలా రోజుల పాటు ఒకే చోట పార్క్ చేయవద్దు.

8. పార్కింగ్ స్థలంలో ఎలుకలు ఎక్కువగా ఉంటే, ఆ ప్రదేశాన్ని మార్చండి.

ఇది కూడా చదవండి: Smartphone Battery: మొబైల్‌ బ్యాటరీలో mAh అంటే ఏమిటి? రోజువారీ వాడకానికి ఏ బ్యాటరీ బెస్ట్‌..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *