Headlines

Bisleri Water: బెంగాల్‌లోని ఓ యూనిట్ నుంచి తీసుకున్న బిస్లరీ శాంపిల్స్‌లో బ్యాక్టీరియా గుర్తింపు!


బిస్లరీ వాటర్ కలుషితం వ్యవహారం మరోసారి కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి యూనిట్ నుండి తీసుకున్న నీటి శాంపిల్స్‌లో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిర్ధారించింది. ఆగస్టు 12న సేకరించిన బ్యాచ్ నంబర్ PB 201కి చెందిన శాంపిల్స్‌లో ఈ ప్రాణాంతక బ్యాక్టీరియాను గుర్తించారు. FSSAIతో పాటు మరో ల్యాబ్‌లో నిర్వహించిన టెస్టుల్లోనూ ఇదే విషయం తేలింది. దీంతో బిస్లరీ సంస్థపై విచారణకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అనుమతించింది. గతంలో గోవాలో జరిగిన ఘటనను బిస్లరీ కొట్టిపారేసిన కొన్ని వారాలకే పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తింది. గోవా శాంపిల్స్‌లో బ్రోమైడ్, క్యాన్సర్ కారక పాలిమర్స్ ఉన్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే బిస్లరీ దానిని కుట్రగా పేర్కొంది. ఇప్పుడు తాజా ఘటనపై బిస్లరీ ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి. FSSAI మాత్రం ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకమైనదని పేర్కొంటూ, నేరుగా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: అనంత్ అంబానీ వీడియోపై షారుఖ్ సీరియస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌కు లీగల్ నోటీస్

9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డుల పునరుద్ధరణ

Samantha: డెలివరీ వేళ సమంత ఫ్యామిలీలో టెన్షన్ ! అసలు కారణం ఇదే!

Vrushakarma Trailer: 5 వేల ఏళ్ల నాటి రహస్యం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్

Kaithi: కార్తి రిక్వెస్ట్ చేయడంతో.. హిట్టు సినిమా వదులుకున్న సేతుపతి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *