Headlines

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!

గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌!


ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో చిత్రవిచిత్రమైన సంఘటనలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా .. తాను గర్భవతినని, ఆరోగ్యం సహకరించడం లేదని మేనేజర్‌కు చెప్పిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఒక మహిళకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ లెటర్ చేతిలో పెట్టింది. సోషల్ మీడియా వేదికగా ‘జిన్’ అనే మహిళ పంచుకున్న ఈ చేదు అనుభవం ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వచ్చే వాంతులు, నీరసం కారణంగా ఖాళీ కడుపుతో ఉండలేక, డ్యూటీ సమయంలో కొన్ని బిస్కెట్లు తినేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తన మేనేజర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టింది. ఆఫీసు నిబంధనల ప్రకారం 6 గంటల షిఫ్ట్ ముగిసే వరకు సిబ్బంది ఏమీ తినకూడదు కాబట్టే ఆమె ముందస్తు అనుమతి కోరింది. కానీ, ఆ మెసేజ్ పంపిన మూడు గంటలకే “నువ్వు ప్రొబేషన్ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తి చేయలేదు” అంటూ కంపెనీ నుంచి టర్మినేషన్ ఈమెయిల్ వచ్చింది. “మేనేజర్‌ను నమ్మి ఎంత మూర్ఖురాలినయ్యానో, ఇంత దారుణంగా నమ్మకద్రోహం చేస్తారని ఊహించలేదు” అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సదరు కంపెనీ తీరుపై మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమైన ‘ప్రెగ్నెన్సీ వివక్షే’నని, సదరు సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!

కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *