Headlines

Bank Accounts: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్ధిక కష్టాలే..

Bank Accounts: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే ఆర్ధిక కష్టాలే..


ఈ రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. శాలరీ కోసం ఒక అకౌంట్, వ్యక్తిగత అవసరాల కోసం మరో అకౌంట్, పెట్టుబడుల కోసం మరో అకౌంట్ వాడుతున్నారు. సౌలభ్యం కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించడం అంత సులువైన పని కాదు. గందరగోళం ఏర్పడటంతో పాటు మీకు అనవసరమైన భారాన్ని తెచ్చి పెడతాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల జరిగే నష్టాలేంటి? అనేది చూద్దాం.

నష్టాలు ఏంటంటే..?

ప్రతీ అకౌంట్లో మినిమం ఛార్జీలు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే డెబిట్, ఎస్‌ఎంఎస్ ఛార్జీలు ప్రతీ ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల అర్ధికంగా నష్టం జరుగుతుంది. అలాగే ఎక్కువ అకౌంట్లను కలిగి ఉంటే మీ నికర విలువ లెక్కించడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో మీ ఆర్ధిక ప్రణాళికకు ఇది ఆటంకం కలిగిస్తుంది. ఇక ఎక్కువ ఖాతాలు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం సొమ్మును చెల్లించడం కష్టమవుతుంది. ప్రతీ అకౌంట్లోని బ్యాలెన్స్‌ను విడివిడిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఒకటి లేదా రెండు అకౌంట్లు కలిగి ఉండటం వల్ల నిర్వహణ సులభంగా ఉంటుంది. ఇక ప్రతీ అకౌంట్ నెంబర్ వేర్వేరుగా ఉంటుంది. పాస్‌వర్డ్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, లావాదేవీల హిస్టరీ, నోటిఫికేషన్ల వల్ల కన్‌ప్యూజన్ ఏర్పడుతుంది. ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు అన్నింటినీ గమనించి ఉంచడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇనాక్టివ్ అయిన అకౌంట్లు, మోసాలు, విఫలమైన లావాదేవీలను గుర్తించడంలో మీకు ఇబ్బంది ఏర్పడుతుంది.

ఎక్కువ అకౌంట్లు ఉంటే..?

ఇక ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్ చెల్లింపుల నిర్వహణలో గందరగోళం ఉంటుంది. దీని వల్ల చెల్లిపులు విఫలం కావడం, పొరపాట్లు వంటివి జరిగే అవకాశముంది. ఇక ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు ప్రతీ అకౌంట్లలో కొంత మొత్తంలో నగదు ఉంటుంది. దీని వల్ల డబ్బులను సరిగ్గా ఉపయోగించలేరు. అదే ఒకేచోట ఉండటం వల్ల బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు మీ నగదును నిర్వహించుకోవడం సులువుగా ఉంటుంది. అలాగే అదనపు ఛార్జీల భారం కూడా తగ్గుతుంది. చాలామంది 4 లేదా 5 అకౌంట్లను కలిగి ఉంటారు. దీంతో ఆర్ధికంగా నష్టపోవచ్చు. రెండు అకౌంట్లను కలిగి ఉండటం మంచిదని, అంతకంటే ఎక్కువ ఉండటం మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *